Update Aadhar: ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండUpdate Aadhar: ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండి!
మన దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రాముఖ్యత గురుంచి మన అందరికీ తెలిసిందే. పుట్టిన చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. పాస్ పోర్టు కోసం ధరఖాస్తు చేసుకోవాలన్న, కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్న మనకు ఆధార్ కార్డు అవసరం. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డులో పేరు, చిత్రం, చిరునామా వంటి మొదలైన వివరాలను అప్ డేట్ చేయడం కోసం యూఐడీఏఐ అనేక సేవలను ఆన్ లైన్ చేసింది.
ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డులోని చిరునామాను అప్ డేట్ చేయాలి అనుకుంటే యూఐడీఏఐ పోర్టల్ ద్వారా మీ చిరునామాలో మార్పు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్ అడ్రస్ మార్చుకోవడం మీకు కష్టమని భావిస్తే.. ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా పని పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ప్రూఫ్ డాక్యుమెంట్ తీసుకెలితే సరిపోతుంది. అయితే, ఈ అప్ డేట్ కోసం రూ.50 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. చిరునామా అప్ డేట్ కోసం పాస్ పోర్ట్, బ్యాంక్ స్టేట్ మెంట్/పాస్ బుక్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్ మెంట్/పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు/వాటర్ బిల్లు/టెలిఫోన్ ల్యాండ్ లైన్ బిల్లు/క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్/గ్యాస్ కనెక్షన్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు అవసరం.
ఆధార్ కార్డులో అడ్రస్ అప్ డేట్ చేసే విధానం :
- మొదట ఆధార్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత మై ఆధార్ సెక్షన్‌లోకి వెళ్లాలి. ఇందులో అప్‌డేట్ యువర్ ఆధార్ అనే ట్యాబ్ ఉంటుంది.
- అప్‌డేట్ యువర్ ఆధార్ అడ్రస్ ఆన్‌లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, క్యాప్చా ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ప్రూఫ్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
కామెంట్‌లు