అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
19, అక్టోబర్ 2021, మంగళవారం
SSC Recruitment 2021: రూ.85,500 వేతనంతో 3261 జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే
SSC
Recruitment 2021 | ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. స్టాఫ్
సెలక్షన్ కమిషన్ (SSC) ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 3261 పోస్టుల్ని భర్తీ
చేస్తోంది. ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారో (Exam Pattern), సిలబస్ ఎలా
ఉంటుందో తెలుసుకోండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్
(SSC) భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి
తెలిసిందే. ఫేజ్ 9 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3261 పోస్టుల్ని భర్తీ
చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 25 లోగా అప్లై చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలతో పాటు దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
10+2, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై
చేయొచ్చు. 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు.
ఎంపికైనవారికి రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.85,500 వేతనం
లభిస్తుంది. మరి ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారు? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా
ఉంటుంది? ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఏం చదవాలి? తెలుసుకోండి.
SSC Phase 9 Recruitment 2021: ఎంపిక విధానం ఇదే...
Exam Pattern:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3261 పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
ద్వారా ఎంపిక చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2022 జనవరి లేదా
ఫిబ్రవరిలో ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మెట్రిక్యులేషన్,
హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఎగ్జామ్ ప్యాటర్న్
వేర్వేరుగా ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ 60 నిమిషాలకు ఉంటుంది. నాలుగు
సబ్జెక్ట్స్‌లో 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ప్రతీ సెక్షన్‌కు 50 మార్కులు
ఉంటాయి. అంటే మొత్తం 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. 60 నిమిషాల్లో ఈ
ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
Subjects:
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్‌కు 25
ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50
మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్ (బేసిక్ ఆర్థమెటిక్ స్కిల్)
సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ (బేసిక్
నాలెడ్జ్) సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మెట్రిక్యులేషన్,
హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఈ సబ్జెక్ట్స్‌లో
ప్రశ్నల స్థాయి వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ తప్పు సమాధానానికి సగం మార్కు
తగ్గుతుంది. అంటే రెండు సమాధానాలు తప్పైతే ఒక మార్కు తగ్గుతుంది.
Skill Test:
కొన్ని పోస్టులకు స్కిల్ టెస్టులు కూడా ఉంటాయి. ఆ పోస్టులకు సంబంధించిన
క్వాలిఫికేషన్‌లో ఈ వివరాలు ఉంటాయి. టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్
ప్రొఫీషియెన్సీ టెస్ట్ లాంటివి ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో
క్వాలిఫై అయినవారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే
కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. ఇతర కేటగిరీలు 25 శాతం మార్కులు
సాధించాలి. స్కిల్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసినవారికి డాక్యుమెంట్
వెరిఫికేషన్ ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి