29, అక్టోబర్ 2021, శుక్రవారం

Central Government: కేంద్ర ప్రభుత్వ పథకం.. దీనిలో చేరితే భార్యాభర్తలు నెలకు రూ.10 వేలు పొందొచ్చు.. వివరాలివే..

Gemini Internet

Central Government: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అందులో రైతులకు ఉపయోగపడేవి ఉన్నాయి. మరికొన్ని సాధారణ పౌరులకు కూడా ఉపయోగపడేవి ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు చెప్పుకునే పథకం అటల్ పెన్షన్ యోజన. దీని ద్వారా నెలకు భార్యాభర్తలు రూ. 10 వేలు తీసుకోవచ్చు. ఎలా అంటే..

రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఎలా తీసుకోవాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజలందరికీ, అటోల్ పెన్షన్ పథకం (అటల్ పెన్షన్ యోజన) ప్రారంభించబడింది. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏ భారతీయ పౌరుడైనా పెన్షన్ పొందవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు.

ఈ పథకంలో చేరడానికి బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా అవసరం. ఈ పథకం తర్వాత 60 సంవత్సరాల తరువాత డిపాజిటర్లు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. మీరు అందుకునే పెన్షన్ మొత్తం మీరు చేసే పెట్టుబడి మరియు మీ వయస్సుపై ఆధారపడి ఉంటుంది.

APY కింద.. ఒక వ్యక్తి కనీసం రూ. 1,000, రూ .2,000, రూ .3,000, రూ .4,000 మరియు రూ.5 వేల వరకు పెన్షన్ పెందవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించబడిని విషయం తెలిసిందే. అయితే అటల్ పెన్షన్ స్కీమ్ యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే.. మీరు ఈ పథకంలో ఎంత త్వరగా చేరితే అంత ఎక్కువ లాభం పొందవచ్చు.

ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరితే, అతడు/ఆమె 60 సంవత్సరాల వయస్సు తరువాత నెలకు రూ. 5,000 పెన్షన్ కోసం నెలకు రూ. 210 జమ చేయాలి. అంటే ఈ పథకంలో రోజుకు కేవలం రూ .7ను జమ చేయడం ద్వారా నెలకు రూ .5 వేల పింఛను పొందవచ్చు.

నెలకు రూ. 3 వేలు పెన్షన్ కావాలంటే రూ.126, రూ. 4 వేలు పెన్షన్ కావాలంటే నెలకు రూ. 168, నెలకు రూ. 2 వేలు పెన్షన్ కావాలంటే రూ. 84 చెల్లించాల్సి ఉంటుంది. మీకు కేవలం రూ. వేయి పెన్షన్ కావాలంటే మాత్రం నెలకు రూ.42 చెల్లిస్తే సరిపోతుంది.

APY మరియు NPS లైట్ యాప్ ద్వారా ఖాతాదారులు తమ లావాదేవీల వివరాలను చూసుకోవచ్చు. ఈ పథకంలో చేరాలంటూ.. బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి జాయిన్ అవ్వొచ్చు. 

లేదా ప్రతీ ఒక్కిరికీ నెట్ బ్యాంకింగ్ ఉండే ఉంటుంది. అందులోకి వెళ్లి కూడా జాయిన్ అవ్వొచ్చు. ఇలా చేరిన సదరు వ్యక్తి అకౌంట్ నుంచి నెల నెలా డబ్బుల కట్ అవుతూ ఉంటాయి. 40ఏళ్ల వయస్సులో జాయిన్ అయిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి.

18 ఏళ్ల వయస్సులో జాయిన్ అయితే 20 ఏళ్లు వరుసగా కట్టాల్సి ఉంటుంది. ఇలా భార్యభర్తలు 40 ఏళ్ల లోపు జాయిన్ అయి నెలకు రూ.5000 వచ్చే స్కీంలో చేరితే 60 ఏళ్ల తర్వాత నెలకు ఇద్దిరకి కలిపి రూ.10 వేలు తీసుకోవచ్చు. 

కామెంట్‌లు లేవు: