PM Mudra Yojana: ఎందరికో ఆసరాగా నిలుస్తున్న పీఎం ముద్ర యోజన స్కీమ్.. ఏడు నెలల్లోనే వందశాతం చేరువలో రుణాల పంపిణీ
PM Mudra Yojana: కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. దేశంలో స్వయం ఉపాధిని పెంపొందించడానికి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి ముద్ర యోజన స్కీమ్ ఒకటి. ఇందులో మొదటి దశలో ఎందరికో ఆసరాగా నిలిచింది. ఇప్పుడు మరో దశ ముద్ర పథకం ప్రారంభమైంది. ఈ స్కీమ్ కింద బ్యాంకులు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. రుణాలు పొందడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం. వందశాతం రుణాలను పంపిణీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 7 నెలల్లో వందశాతం రుణాలు పంపిణీ చేసే స్థాయికి చేరింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రూ.1.17 లక్షల కోట్ల వరకు రుణాలను మంజూరు చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 95.19 శాతం రుణాలు పంపిణీ చేయడం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు వంద శాతం రుణాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం. 2016లో 96.73 శాతం, 2017లో 97.11 శాతం, 2018లో 97.14 శాతం, 2019లో 97 శాతం, 2020 ఆర్థిక సంవత్సరంలో 97.6 శాతం ఉండగా. ఈ ఆర్థిక సంవత్సరంలో వంద శాతం వరకు రుణాలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ పథకాన్ని ఏప్రిల్ 8, 2015న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం..
కాగా, దీని ద్వారా అర్హత కలిగిన వారు సులభంగానే రుణం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం ముద్రా యోజన కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉన్నాయి. వీటిల్లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
చిరునామా, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ వంటివి ఉంటే ఈ రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం బ్యాంకు బ్రాంచుకు వెళ్లాలి. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ రేట్లు బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. https://udyamimitra.in/ లింక్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్ అగ్రో ఇండస్ట్రీస్, డైరీ, ఫిషరీ, అగ్రికల్నిక్స్, అగ్రిబిజినెస్ సెంటర్లు, ఫుడ్ అండ్ అగ్రో-ప్రాసెసింగ్ వంటి వ్యవసాయానికి సంబంధించిన వాటికి అర్హులు.
కామెంట్‌లు