అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
18, అక్టోబర్ 2021, సోమవారం
APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా
APPSC Recruitment 2021 |
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో ఖాళీల భర్తీకి వరుసగా
జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(APPSC). ఏపీ శాసనసభలో ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పలు ఖాళీల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. ఇప్పటికే 151 మెడికల్ ఆఫీసర్ (Medical Officer) పోస్టులకు, 39 హార్టికల్చర్ ఆఫీసర్ (Horticulture Officer) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 18న ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీస్‌లో తెలుగు రిపోర్టర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు
దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 8 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు
సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ గురించి
తెలుసుకోండి.
APPSC Recruitment 2021: నోటిఫికేషన్ వివరాలు
భర్తీ చేసే పోస్టు పేరు
తెలుగు రిపోర్టర్
మొత్తం ఖాళీలు
5
దరఖాస్తు ప్రారంభం
2021 అక్టోబర్ 18
దరఖాస్తుకు చివరి తేదీ
2021 నవంబర్ 8
APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి.
వయస్సు-
2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ,
ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు
వయస్సులో సడలింపు ఉంటుంది.
ఈ
పోస్టులే కాకుండా 4 డీపీఆర్‌ఓ పోస్టులకు 2021 అక్టోబర్ 19న, 6 అసిస్టెంట్
డైరెక్టర్ పోస్టులకు 2021 అక్టోబర్ 22న, 6 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్
ఆఫీసర్, 29 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, 1 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, 2
హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు నవంబర్ 12న దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్
కమిషన్ (APPSC) అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఫాలో కావాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి