Kisan Vikas Patra: కిసాన్ వికాస్ పత్రలో పదేళ్లలో మీ డబ్బు రెట్టింపు
సురక్షిత పెట్టుబడికి పోస్టాఫీస్ స్కీం అద్భుతమైన ఎంపిక. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ భద్రమైన పెట్టుబడి కోసం, రిస్క్ తీసుకోవడం పెద్దగా ఇష్టపడని చాలామంది దీనిని ఎంచుకుంటారు. పోస్టాఫీస్ స్కీం ద్వారా గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. ఇలాంటి పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీంలలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే 124 నెలలు లేదా 10 సంవత్సరాల్లో మీ డబ్బు రెండింతలు అవుతుంది. ఏప్రిల్ 1, 2020 నుండి ఈ పథకానికి సంబంధించి వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. కనీసం రూ.1000తో పెట్టుబడులు ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ కిసాన్ వికాస పత్ర ఖాతాలు తెరుచుకోవచ్చు. ఒక వ్యక్తి మరొకరికి కేవీపీ పత్రాలను బదలీ చేసుకోవచ్చు. రుణం ఇస్తారు. ఇందుకు కేవీపీ తీసుకున్న వ్యక్తి సంబంధిత పోస్టాఫీస్‌కు అంగీకార పత్రంతో కూడిన దరఖాస్తు ఫామ్‌ను ఇవ్వాలి. ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్‌కు బదలీ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తేదీని సర్టిఫికెట్లో ముద్రిస్తారు. Gemini Internet అకౌంట్ ఓపెనింగ్ KVP పథకంలో పెట్టుబడికి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు. వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఖాతా ఓపెన్ చే...