25, నవంబర్ 2021, గురువారం

DJ music సౌండుకు 63 కోళ్లు మృతి -పక్కా ఆధారాలతో పౌల్ట్రీ ఓనర్ కేసు.. చివరికి.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం(Air Pollution)  పై నానా రభస జరుగుతుండగా, తూర్పు రాష్ట్రం ఒడిశాలో ధ్వని కాలుష్యానికి సంబంధించి సంచలన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. డీజే మ్యూజిక్ సౌండుకు తట్టుకోలేక తన పౌల్ట్రీ ఫామ్ లోని 63 కోళ్లు చనిపోయాయని ఆరోపిస్తూ దీనికి బాధ్యులైనవారిపై మర్డర్ కేసు (Murder case) పెట్టాల్సిందిగా ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కోళ్ల మరణం ముమ్మాటికీ డీజీ సౌండ్ వల్లే సంభవించిందని వెటర్నరీ డాక్టర్ ఇచ్చిన రిపోర్టును సైతం ఆయన పోలీసుల ముందు ఉంచాడు. చరిత్రలో ఏనాడూ ఇలాంటి ఆరోపణల్ని విని ఎరుగని పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ వివాదంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఒడిశాలోని బాలోసోర్ జిల్లా నీలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అనూహ్య ఘటన వివరాలివి..

బాలాసోర్ జిల్లాలోని కందగరాది గ్రామానికి చెందిన రంజిత పారిదా(22) ఇంజనీరింగ్ గ్రాడ్యువేట్. చదువయ్యాక ఉద్యోగం దొక్కపోవడంతో కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని సొంత గ్రామంలోనే కోళ్ల ఫారం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా ఆ ఫారం ఫర్వాలేదనే స్థాయిలో నడుస్తోంది. కాగా, మొన్న ఆదివారం నాడు రంజిత్ పొరుగున ఉండే రామచంద్ర ఇంట్లో వివాహ వేడుక జరిగింది. పెళ్లి ఊరేగింపులో డీజీ మ్యూజిక్ పెట్టారు. పెద్ద ఎత్తున పటాకులుసైతం కాల్చారు. భారీ శబ్దాలతో పెళ్లి ఊరేగింపు.. రంజిత్ పౌల్ట్రీ ఫారం ముందు నుంచి ఊరు దాటింది. బారత్ లో డీజీ చప్పుళ్లు, పటాకుల పేలుళ్లకు ఫారంలో కోళ్లన్నీ బెదిరిపోయాయి..

Gemini Internet

కామెంట్‌లు లేవు: