Bank of Baroda Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 376 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు
Gemini Internet
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్
విడుదల చేసింది. రిలేషన్‌షిప్ మేనేజర్ (Relationship Manager) పోస్టుల్ని
భర్తీ చేస్తోంది. మొత్తం 376 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని
బ్యాంకింగ్ రీజియన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 12 పోస్టులు
ఉన్నట్టు నోటిఫికేషన్‌లో వెల్లడించింది బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda). డిగ్రీ పాస్ అయినవారితో పాటు బ్యాంకింగ్ రంగంలో రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 9 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
Bank of Baroda Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు | 376 | విద్యార్హతలు | అనుభవం | వయస్సు |
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ | 326 (హైదరాబాద్- 12) | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయినవారికి, NISM, IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. | ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీ సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో వెల్త్ మేనేజ్‌మెంట్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. | 24 నుంచి 35 ఏళ్లు |
ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ | 50 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయినవారికి, NISM, IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. | ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీ సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో వెల్త్ మేనేజ్‌మెంట్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా ఏడాదిన్నర పనిచేసిన అనుభవం ఉండాలి. | 23 నుంచి 35 ఏళ్లు |
కామెంట్‌లు