India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల అభ్యర్థులకు అలర్ట్... గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు ఎప్పుడంటే..?
India Post GDS Results 2021 | మీరు గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఉద్యోగానికి అప్లై చేశారా? ఇటీవల మీ ఆప్షన్స్ మార్చారా? పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే అలర్ట్. ఫలితాలు ఎప్పట్లోపు రావొచ్చో తెలుసుకోండి.
1. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు (Post Office Jobs)
భర్తీ చేయడంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్
(Gramin Dak Sevak) పోస్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు
నోటిఫికేషన్ల ద్వారా 3,446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి
దరఖాస్తుల్ని స్వీకరించింది. 2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 వరకు
దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది.
Gemini Internet
2. సాధారణంగా రెండు నెలల్లోపే ఫలితాలు వస్తుంటాయి. కానీ కొన్ని నెలలైనా ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఇండియా పోస్ట్ ఈ ఫలితాలను వెల్లడించలేదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్, హైదరాబాద్ ఆదేశాల మేరకు విత్‌హెల్డ్ పోస్టుల స్థానంలో అభ్యర్థులు ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం కల్పించింది ఇండియా పోస్ట్.
3. 2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 మధ్య గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ కొత్త ఆప్షన్స్ ఎంచుకోవడానికి 2021 నవంబర్ 18 వరకు అవకాశం ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు https://appost.in/ వెబ్‌సైట్‌లో ఆప్షన్స్ మార్చుకున్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థులు అంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
4. గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు ముగిసిన రెండు నెలల్లోపు ఫలితాలు విడుదల చేస్తుంది ఇండియా పోస్ట్. ఆప్షన్స్ మార్చుకునే గడువు నవంబర్ 18న ముగియడంతో డిసెంబర్ లోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. https://appost.in/ వెబ్‌సైట్‌లో Results Under Process స్టేటస్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి.
5. గ్రామీణ డాక్ సేవక్ ఫలితాల కోసం అభ్యర్థులు ట్విట్టర్‌లో ఇండియా పోస్ట్‌ను సంప్రదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ ఫలితాల కోసం APCO, విజయవాడ ఇమెయిల్ ఐడీ rectt.ap@indiapost.gov.in లో సంప్రదించాలని ఇండియా పోస్ట్ తెలిపింది. లేదా 0866 - 2429822 నెంబర్‌కు కాల్ చేయాలని కోరుతోంది. ఇక తెలంగాణ అభ్యర్థులు tcgds2021@gmail.com మెయిల్ ఐడీలో లేదా 040-23463617 ఫోన్ నెంబర్‌లో సంప్రదించొచ్చు. (Source: Twitter)
6. తెలంగాణలో 1150 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. వీటిలో రిజర్వేషన్ వారీగా పోస్టుల వివరాలు చూస్తే మొత్తం ఖాళీలు- 1150, జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 484, ఓబీసీ- 279, ఈడబ్ల్యూఎస్- 130, PWD-A- 9, PWD-B- 14, PWD-C- 15, ఎస్సీ- 154, ఎస్టీ- 65 పోస్టుల్ని కేటాయించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 2296 ఖాళీలు ఉన్నాయి. రిజర్వేషన్ వారీగా పోస్టుల వివరాలు చూస్తే జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 947, ఓబీసీ- 507, ఈడబ్ల్యూఎస్- 324, PWD-A- 18, PWD-B- 34, PWD-C- 35, PWD-DE- 9, ఎస్సీ- 279, ఎస్టీ- 143 పోస్టులున్నాయి.
7. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లో 266 పోస్టులు, ఉత్తరప్రదఏశ్‌లో 4264 పోస్టులు, ఉత్తరాఖండ్‌లో 581 పోస్టులు, పశ్చిమ బెంగాల్‌లో 2357 పోస్టులు, బీహార్‌లో 1940 పోస్టులు, మహారాష్ట్రలో 2428 పోస్టులు, ఢిల్లీలో 233 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల కావాల్సి ఉంది. ఈ ఫలితాలను ఒకదాని వెంట మరొకటి విడుదల చేయనుంది ఇండియా పోస్ట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు రెండు నెలల్లో రిలీజ్ కావొచ్చు.
కామెంట్‌లు