TTD Update నవంబర్ 27 నుంచి వర్షాలు కురుస్తాయి. కానీ అల్పపీడనం పైన కన్వర్జెన్స్
*నవంబర్ 28వ తేదీ నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షపాతానికి కారణమవుతుంది.*
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ప్రస్తుతానికి శ్రీలంక దక్షిణ భాగాల్లో ఉంది. ఆ అల్పపీడనం మెల్లగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం ఈ నెలలో వచ్చిన అల్పపీడనాలు లాగ కాదు. కాస్త భిన్నంగా ఉత్తర దిశగా ఎక్కువ CONVERGENCE కనిపిస్తోంది. ఇది వాయుగుండంగా మారదు కానీ బలమైన అల్పపీడనంగా శ్రీలంక ఉత్తర దిశగా కదలనుంది. దిని వల్ల ఆ CONVERGENCE బెల్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భాగాల్లో పడనుంది కాబట్టి భారీ వర్షాలు విస్తారంగా పడనున్నాయి.
నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలు చాలా అపమత్తంగా ఉండాలి. ఈ అల్పపీడనం మెల్లగా ఆ అండమాన్ దీవుల దగ్గర ఉన్న భారీ మేఘాలను తీసుకొని మన రాష్ట్రం దక్షిణ భాగాల పై వదలనుంది. నవంబర్ 27 న మెళ్లగా నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలౌతాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 దాక తీవ్రమైన వర్షాలు నెల్లూరు, చిత్తూరు-తూర్పు, ప్రకాశం, కడప జిల్లాల పై పడనున్నాయి. దీని వల్ల వరద మరింత ఎక్కువౌతుంది. కొన్ని చోట్ల ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అతితీవ్రమైన వర్షాలు (more than 300 mm rainfall) పడనున్నాయి.
ఈ రోజు మనం మధ్యాహ్నం, సాయంకాల సమయంలో రాయలసీమ జిల్లాల్లో వర్షాలను చూడొచ్చు.
ఈ మధ్య ప్రణాలిక వేసుకొని మరీ వాతావరణ అప్డేట్లు చేయాల్సి వస్తోంది. ఆఫీసులో సాఫ్ట్ వేర్ కంపెనీ ఒత్తిడి ఒక వైపు, మరో వైపు వాతావరణ అప్డేట్లు. కొన్ని సార్లు కష్టమే, ముఖ్యంగా ఇలాంటి విపత్తు సమయంలో.
Gemini Internet
కామెంట్‌లు