22, నవంబర్ 2021, సోమవారం

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1,317 ఉద్యోగాలు. దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 5

Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మరో 1317 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ లాంటి పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1,317 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, సానిటరీ అటెండర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు.


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో రెగ్యులర్ పద్ధతిలో 896 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 1 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక తాజాగా ప్రకటించిన 1,317 పోస్టులకు పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 5 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విద్యార్హతలు తెలుసుకోండి.

Gemini Internet


దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 21

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 5

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

ఎంపిక విధానం- మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.

 

 

కామెంట్‌లు లేవు: