25, నవంబర్ 2021, గురువారం

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉందా? లక్ష రూపాయల లోన్ ఇస్తున్న బ్యాంక్


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్. కస్టమర్లకు అనేక లోన్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటుంది ఎస్‌బీఐ. షాపింగ్ కోసం డబ్బులు కావాలనుకునేవారికి క్షణాల్లో లోన్ ఇచ్చే ఆఫర్ ఒకటి ఉంది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లకు రూ.8,000 నుంచి రూ.1,00,000 వరకు ఇన్‌స్టంట్ లోన్ ఇస్తోంది ఎస్‌బీఐ. ఈఎంఐ ఫెసిలిటీ కోసం ఈ లోన్ ఉపయోగించుకోవచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారు ఈ రుణం పొందడానికి అర్హులు. క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఎలాగూ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు. కానీ క్రెడిట్ కార్డ్ లేనివాళ్లు కూడా ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ఉంటే చాలు. షాపింగ్ చేసి ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇలా రూ.8,000 నుంచి రూ.1,00,000 మధ్య ఎంతైనా షాపింగ్ చేయొచ్చు.


ప్రీ-అప్రూవ్డ్ పద్ధతి ద్వారా ఈ లోన్ ఇస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే కస్టమర్లకు ముందుగానే లోన్ అప్రూవ్ చేస్తుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ కావాలనుకునే కస్టమర్లు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా బయట వ్యాపారుల దగ్గర షాపింగ్ చేసిన తర్వాత ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ స్వైప్ చేసి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ ఆఫర్ పొందొచ్చు. మరి మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే డెబిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా మీకు ఎంత వరకు లోన్ వస్తుందో తెలుసుకోవడానికి ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే చాలు.

Gemini Internet

click here for official tweet https://twitter.com/i/status/1458343629680832514

Step 1- ఏదైనా షాపులో మీ షాపింగ్ పూర్తైన తర్వాత పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్‌లో మీ ఏటీఎం కార్డు సెలెక్ట్ చేయాలి.


Step 2- ఆ తర్వాత బ్రాండ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి.

Step 3- ఆ తర్వాత బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 4- మీరు ఎంత మొత్తం వాడుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయాలి.

Step 5- ఆ తర్వాత ఎన్ని నెలల్లో తిరిగి చెల్లించాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయాలి.

Step 6- 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 18 నెలల ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Step 7- ఆ తర్వాత మీ డెబిట్ కార్డ్ పిన్ ఎంటర్ చేయాలి.

ఆన్‌లైన్‌లో కూడా దాదాపుగా ఇదే పద్ధతిలో ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రతీ నెలా మీ అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవుతూ ఉంటుంది. మీరు ఉపయోగించుకున్న మొత్తానికి 14.70 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకున్నవారికి ప్రాసెసింగ్ ఫీజు లేదని చెబుతోంది బ్యాంకు. డాక్యుమెంటేషన్ కూడా లేదు. ఇన్‌స్టంట్‌గా లోన్ మంజూరవుతుంది. సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌ను కూడా బ్లాక్ చేయమని చెబుతోంది బ్యాంకు. 


కామెంట్‌లు లేవు: