23, నవంబర్ 2021, మంగళవారం

AICTE Scholarship: నవంబర్ 30న ముగియనున్న ఏఐసీటీఈ స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్.. నవంబర్ 30లోగా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోండి.

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఇటీవలే ఏఐసీటీఈ 2022 సంవత్సరం కొరకు స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ఇటీవల ప్రారంభించింది. ఇది ప్రస్తుతం వివిధ రకాల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30లోగా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని ఏఐసీటీఈ (AICTE) పేర్కొంది. నేషనల్ స్కాలర్‌షిప్‌ పోర్టల్ (NSP) scholarships.gov.in లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా విద్యార్థినుల (girl students)కు ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్... టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా దివ్యాంగ (specially-abled) విద్యార్థులకు ఏఐసీటీఈ సక్షం(Saksham) స్కాలర్‌షిప్... టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా కోసం ఏఐసీటీఈ స్వాత్ స్కాలర్‌షిప్ అనే మూడు రకాల స్కాలర్‌షిప్‌లను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆఫర్ చేస్తోంది. నాలుగేళ్ల చదువుకు ప్రగతి స్కాలర్‌షిప్‌ పొందాలంటే విద్యార్థినులు టెక్నికల్ డిగ్రీ/ టెక్నికల్ డిప్లమాలో మొదటి లేదా రెండో సంవత్సరం చదువుతుండాలి. అయితే విద్యార్థినులు ఏఐసీటీఈ ఆమోదించిన కాలేజీల్లోనే చదువుతుండాలి. దివ్యాంగ విద్యార్థులు, అర్హత గల ఇతర విద్యార్థులు సైతం పైన పేర్కొన్న విధంగా చదువుతుండాలి.

పైన పేర్కొన్న మూడు రకాల స్కాలర్‌షిప్‌లతో పాటు విద్యార్థులు aicte-india.orgలో AICTE PG స్కాలర్‌షిప్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ ఆమోదించిన రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో చేరిన గేట్, జీప్యాట్‌, సీడ్ క్వాలిఫైడ్ విద్యార్థులు ఏఐసీటీఈ పీజీ స్కాలర్‌షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు 24 నెలలకు లేదా కోర్సు వ్యవధికి నెలకు రూ.2,400 అందుకుంటారు. స్కాలర్‌షిప్ పథకాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీటి రిజిస్ట్రేషన్ నవంబర్ 30న ముగుస్తుందని విద్యార్థులు గమనించాలి.

* ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్ (AICTE Pragati Scholarship)

- కోర్స్ పూర్తయ్యేంతవరకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అందుతుంది.

- వెబ్‌సైట్: Scholarships.gov.in

* ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్ (AICTE Saksham Scholarship)

- కోర్స్ పూర్తయ్యేంతవరకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అందుతుంది.

- వెబ్‌సైట్: Scholarships.gov.in

* ఏఐసీటీఈ స్వాత్ స్కాలర్‌షిప్ (AICTE SWATH Scholarship)

- కోర్స్ పూర్తయ్యేంతవరకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అందుతుంది.

- వెబ్‌సైట్: Scholarships.gov.in

ఉన్నత చదువులు పూర్తి చేయాలనుకున్న విద్యార్థులు ఏఐసీటీఈ ఆఫర్ చేస్తున్న స్కాలర్‌షిప్‌తో కాలేజ్ ఫీజు కంప్యూటర్, పుస్తకాలు తదితర విద్యా సంబంధిత వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందుపరచాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో ప్రతియేటా స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ విద్యార్థులకు వేయి కంటే ఎక్కువగానే స్కాలర్‌షిప్‌లు కేటాయించింది ఏఐసీటీఈ. ఆసక్తిగల విద్యార్థులు Scholarships.gov.in స్కాలర్‌షిప్‌ గైడ్ లైన్స్ చెక్ చేయగలరు.

Gemini Internet

ఉన్నత చదువులు పూర్తి చేయాలనుకున్న విద్యార్థులు ఏఐసీటీఈ ఆఫర్ చేస్తున్న స్కాలర్‌షిప్‌తో కాలేజ్ ఫీజు కంప్యూటర్, పుస్తకాలు తదితర విద్యా సంబంధిత వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

కామెంట్‌లు లేవు: