ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల
చేసింది. ఐదు, ఎనిమిదో తరగతి విద్యార్హతతో 380 వాచ్‌మెన్ పోస్టులను
భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ (Online)
పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ
పోస్టుల దరఖాస్తుకు నవంబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది. పోస్టులకు
ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.23,000 నుంచి రూ. 64,000 జీతం
చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకొనే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి
ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం..
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థికి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష 120 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
- పరీక్ష ఇంగ్లీష్, హిందీ, పంజాబీలో నిర్వహిస్తారు.
- పరీక్షలో ఎటువంటి నెగెటీవ్ మార్కింగ్ లేదు.
- మెరిట్ ద్వారా ఎంపికైన వారిని పోస్టులోకి తీసుకొంటారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.recruitmentfci.in/ ను సందర్శించాలి.
Step 3 : వెబ్‌సైట్‌ల Category IV Recruitment లింక్‌లోకి వెళ్లాలి.
Step 4 : అనంతరం నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 6 : అనంతరం కుడివైపు పైన Register Here క్లిక్ చేసి దరఖాస్తు విధానాన్ని ప్రారంభించాలి.
Step 7 : క్లిక్ చేసిన తరువాత ఇన్‌స్ట్రక్షన్‌లు వస్తాయి. చదవాలి.
Step 8 : ఇన్‌స్ట్రక్షన్ చదవిన తరువాత కింద చెక్ బాక్స్ టిక్ చేసి Apply Now లోకి వెళ్లాలి.
Step 9 : పేరు, ఫోటో ఐడీ, ఈమెయిల్, మొబైల్ నంబర్ ఇచ్చి అనంతరం విద్యార్హతలు ఇవ్వాలి.
Step 10 : రిజిస్ట్రేషన్ పూర్తియిన తరువాత రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Step 11 : దరఖాస్తు పూర్తయిన తరువాత ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 12 : ఈ పోస్టుల దరఖాస్తుకు నవంబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది.
పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు | వయసు | జీతం |
వాచ్‌మెన్ | 380 | ఐదు, ఎనిమిదవ తరగతి చదివి ఉండాలి | సెప్టెంబర్ 1, 2021 నాటికి 25 ఏళ్లు నిండకూడదు | రూ.23,000 నుంచి రూ.64,000 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి