AISSEE -2022: సైనిక్ స్కూల్‌లో అడ్మిషన్‌కు దరఖాస్తు చేశారా.. పరీక్ష విధానం గురించి తెలుసుకోండి
AISSEE -2022: దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ఈ నేపథ్యంలో జనవరి 9, 2022న జరగే పరీక్షకు సంబంధించిన పరీక్ష విధానం మార్కుల గురించి తెలుసుకుందాం.
Gemini Internet
దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification)
విడుదల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్ ద్వారా ఆరోతరగతి,
తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష
నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5,
8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ
ముగిసింది. ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న
నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు
అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.
ముఖ్య సమాచారం ..
పరీక్ష తేదీ | జనవరి 9, 2022 |
పరీక్ష సమయం | ఆరోతరగతి ప్రవేశాలకు 150 నిమిషాలు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 180 నిమిషాలు |
అధికారిక వెబ్‌సైట్ | https://aissee.nta.nic.in/ www.nta.ac.in |
అర్హతలు..
- ప్రస్తుతం ఐదోతరగతి చదివే
విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో
తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు 31.03.2021 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.
ఆరోతరగతి ప్రవేశాలకు పరీక్ష విధానం..
టాపిక్ | ప్రశ్నల సంఖ్య | ప్రతీ ప్రశ్నకు మార్కులు | మొత్తం మార్కులు |
మ్యాథమెటిక్స్ | 50 | 3 | 150 |
ఇంటలిజెన్స్ | 25 | 2 | 50 |
లాగ్వేజ్ | 25 | 2 | 50 |
జనరల్ నాలెడ్జ్ | 25 | 2 | 50 |
మొత్తం | 125 | 300 |
తొమ్మిదో తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష విధానం..
టాపిక్ | ప్రశ్నల సంఖ్య | ప్రతీ ప్రశ్నకు మార్కులు | మొత్తం మార్కులు |
మ్యాథమెటిక్స్ | 50 | 4 | 200 |
ఇంటలిజెన్స్ | 25 | 2 | 50 |
లాగ్వేజ్ | 25 | 2 | 50 |
జనరల్ సైన్స్ | 25 | 2 | 50 |
సోషల్ సైన్స్ | 25 | 2 | 50 |
మొత్తం | 150 | 500 |
విద్యాప్రమాణాలు మెరుగుపడ్డాయి: యూనిసెఫ్
కామెంట్‌లు