Andhra Pradesh Jobs: రూ.53,500 వేతనంతో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్ ఆస్పత్రుల్లో 896 ఉద్యోగాలు | దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటలు
APVVP Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.
Gemini Internet
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్ ఆస్పత్రుల్లో (APVVP Hospitals) రెగ్యులర్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 896 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం మరిన్ని ఖాళీలను భర్తీ చేసే అలోచనలో ఉంది కాబట్టి నియామక ప్రక్రియ ముగిసే నాటికి పోస్టుల సంఖ్య
పెరిగే అవకాశం ఉంది. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, జనరల్
మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ప్యాథాలజీ, ఆప్తమాలజీ, రేడియాలజీ,
సైకియాట్రి, డెర్మటాలజీ, ఈఎన్‌టీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 1 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.
APVVP Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు | 896 |
గైనకాలజీ | 302 |
పీడియాట్రిక్స్ | 120 |
అనస్తీషియా | 118 |
జనరల్ మెడిసిన్ | 61 |
జనరల్ సర్జరీ | 53 |
ఆర్థోపెడిక్స్ | 29 |
ప్యాథాలజీ | 19 |
ఆప్తమాలజీ | 29 |
రేడియాలజీ | 21 |
సైకియాట్రి | 8 |
డెర్మటాలజీ | 13 |
ఈఎన్‌టీ | 21 |
సీఎఎస్ జనరల్ | 86 |
డీఏఎస్ | 16 |
APVVP Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటలు
వేతనం- రూ.53,500
విద్యార్హతలు-
సీఏఎస్ జనరల్ పోస్టులకు ఎంబీబీఎస్ పాస్ కావాలి. సీఏఎస్ స్పెషలిస్ట్
పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ పాస్
కావాలి. డీఏఎస్ పోస్టులకు బీడీఎస్ పాస్ కావాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ
స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఏపీ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయస్సు- 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,500. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.1,000.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
APVVP Recruitment 2021: దరఖాస్తు విధానం
Step 1- అభ్యర్థులు https://dmeaponline.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.For New Applicant Register Here పైన క్లిక్ చేయాలి.
Step 2- యూజర్ నేమ్, పాస్‌వర్డ్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Step 3- ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 8- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
కామెంట్‌లు