7, నవంబర్ 2021, ఆదివారం

Covid Scholarship Programmes 2021-22

కరోనా కారణంగా పేరెంట్స్ ను కోల్పోయిన వారికి స్కాలర్ షిప్ లు..

కరోనా(Corona) మహమ్మారి పంజాతో అనేక మంది ప్రాణాలు(Corona Death) కోల్పోయారు. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు ఈ మహమ్మారికి బలయ్యారు. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులను(Parents) కోల్పోయిన అనేక మంది చిన్నారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వారి చదువులు(Education) అర్థంతరంగా ఆగిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ సంస్థలు కరోనా(Corona) కారణంగా ఇంటి పెద్దలను కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాయి. వారికి స్కాలర్ షిప్(Scholarship) లు అందించనున్నట్లు ప్రకటించాయి. అలాంటి స్కాలర్ షిప్ ల వివరాలు..

1. Kotak Shiksha Nidhi:
కరోనా కారణంగా తల్లిదండ్రులను లేదా కుటుంబంలో సంపాధించే వారిని కోల్పోయిన వారికి ‘కొటక్ శిక్ష నిధి’ స్కాలర్ షిప్ ను అందిస్తోంది. మొదటి తరగతి నుంచి డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివే వారు ఈ స్కాలర్ షిప్ లకు అప్లై చేసుకునేందుకు అర్హులు.
అర్హతలు:
-కరోనాతో ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన వారు లేదా ఒకరిని కోల్పోయిన వారు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు అర్హులు.
-కరోనా తో కుటుంబంలో ప్రాథమిక సంపాదన సభ్యుడిని కోల్పోయిన వారు..(తల్లిదండ్రులు కాకుండా..)
-విద్యార్థులు స్కూల్ లేదా కాలేజీకి పోయే వారు అయి ఉండాలి. వయస్సు 6 నుంచి 22 ఏళ్లు ఉండాలి.(క్లాస్ 1 నుంచి డిగ్రీ, డిప్లొమా కోర్సు)
ఆఖరి తేదీ: ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు వచ్చే ఏడాది మార్చి 31 ఆఖరి తేదీ.
అప్లికేషన్ లింక్: https://kotakeducation.org/kotak-shiksha-nidhi/

2. HDFC Bank Parivartan’s Covid Crisis Support Scholarship Programme 2021:
-HDFC బ్యాంక్ పరివర్తన్ సపోర్ట్ స్కాలర్ షిప్ కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ఈ స్కాలర్ షిప్ ను ప్రకటించింది. క్లాస్ 1 నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే వారు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు.
అర్హతలు:
-కరోనా కారణంగా తల్లిదండ్రులను, సంపాధించే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారు కూడా ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసేందుకు అర్హులు.

-అభ్యర్థులు క్లాస్ 1 నుంచి 12, డిప్లొమా, యూజీ, పీజీ చదివే వారు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు అర్హులు.
-దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం రూ. 6 లక్షలలోపు ఉండాలి.
ఆఖరి తేదీ: ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
అప్లికేషన్ లింక్: www.b4s.in/it/CCSS1

3. Digital Bharati Covid Scholarship 2021-22
డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్‌షిప్ ను కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అందిస్తున్నారు.
ఆఖరి తేదీ: నవంబర్ 31
అప్లికేషన్ లింక్: www.b4s.in/it/DBCS1

 

కామెంట్‌లు లేవు: