DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. కేవలం మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక
ఇటీవల పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్
(Job Notification) విడుదలైంది. సంస్థకు చెందిన Terminal Ballistics
Research Laboratoryలో 61 ఖాళీలను అప్రంటీస్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఎగ్జామ్ (Exam) లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్
(Apprenticeship) విధానంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం
చేశారు. ఇంకా.. ఎంపికైన వారికి ఉపకారవేతనంగా నెలకు రూ. 8050 (stipend)
చెల్లించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
ఈ
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ
కింది ట్రేడ్ లలో ఐటీఐ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ ల
వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు NAPS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Step 2: అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి అన్ని కావాల్సిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
Step 3: అనంతరం
అభ్యర్థులు టెన్త్ క్లాస్ మార్క్ షీట్, ఐటీఐ పాస్
సర్టిఫికేట్&మార్క్స్ షీట్, కాస్ట్ సర్టిఫికేట్, ఐడీ ప్రూఫ్ స్కానింగ్
కాపీలను సింగిల్ పీడీఎఫ్ ఫైల్ లో admintbrI@tbrl.drdo.in మెయిల్ లో
పంపించాల్సి ఉంటుంది.
Step 4: ఈ
ఉద్యోగాలకు అప్లై చేసేందుకు డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో
స్పష్టం చేశారు.
ఎంపిక ఎలా చేస్తారంటే..
-అభ్యర్థులు విద్యార్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేపడుతారు.
-ఒక వేళ మార్కులు సమానంగా ఉంటే కింది తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు.
-ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, ఫోన్ ద్వారా ట్రైనింగ్ కు సంబంధించిన సమాచారం ఇస్తారు.
S.No. | ట్రేడ్ | ఖాళీలు |
1 | డ్రాట్స్ మెన్(Draughtsman (Civil) | 1 |
2 | మెకానిక్ మెకాట్రానిక్స్ | 1 |
3 | ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ | 1 |
4 | మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ | 3 |
5 | మెకానిక్(Embedded Systems and PLC) | 1 |
6 | ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్(సివిల్) | 1 |
7 | హౌస్ కీపర్ | 1 |
8 | ఫిట్టర్ | 7 |
9 | మెషినిస్ట్ | 4 |
10 | టర్నర్ | 3 |
11 | కార్పెంటర్ | 1 |
12 | ఎలక్ట్రీషియన్ | 8 |
13 | ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 8 |
14 | మెకానిక్ మోటర్ వెహికిల్ | 2 |
15 | వెల్డర్ | 6 |
16 | కంప్యూటర్ పెరిఫిరల్స్ హార్డ్ వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ | 2 |
17 | కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ | 3 |
18 | డిజిటల్ ఫొటోగ్రాఫర్ | 3 |
19 | సెక్రెటేరియల్ అసిస్టెంట్ | 3 |
20 | స్టేనోగ్రాఫర్ | 1 |
Gemini Internet
కామెంట్‌లు