Google Scholarship ఎంపికైతే రూ. 74 వేల స్టైఫండ్.
కంప్యూటర్ సైన్స్ చదివే అమ్మాయిలకు టెక్ దిగ్గజం గూగుల్ తీపి కబురు అందించింది. కంప్యూటర్ సైన్స్‌ను కెరీర్‌గా మలచుకోవాలని అనుకుంటున్న విద్యార్థినులకు స్కాలర్‌షిప్ అందించడానికి గూగుల్ తాజాగా సిద్ధమైంది. ఈ మేరకు 'జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్' ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం విద్యార్థినుల నుంచి గూగుల్ స్కాలర్‌షిప్ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.
కంప్యూటర్ సైన్స్ (Computer Science)లో చదివే మహిళలకు గూగుల్ (Google)
స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ
ఆసియా-పసిఫిక్ నుంచి వచ్చిన మహిళల కోసం మాత్రమే ప్రారంభించారు. కాబట్టి
భారతీయ విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు (Application)
చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్‌లో మహిళల (Women) కోసం జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ (Scholarship)
టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అభ్యసించడానికి విద్యార్థులకు
సాయం అందిస్తుంది. ఎంపికైన విద్యార్థులు 2022-2023 విద్యా సంవత్సరానికి
$1000 (రూ.74191.35) విలువైన స్కాలర్‌షిప్‌లను అందుకుంటారు. ఈ
స్కాలర్‌షిప్ ద్వారా కంప్యూటర్ సైన్స్ చదివే వారిని మరింత
ప్రోత్సహించాలనేది గూగుల్ లక్ష్యం. ఈ స్కాలర్‌షిప్ విద్యార్థి పనితీరు
ఆధారంగా ఇస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవడానికి
డిసెంబర్ 10, 2021 వరకు అవకాశం ఉంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..
జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పొందేందుకు అర్హతలు
- దరఖాస్తు చేసుకొనే వారు 2021-2022 విద్యాసంవత్సరంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో నమోదు అయి ఉండాలి.
- ఆసియా-పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం విద్యార్థి అయి ఉండాలి.
- అభ్యర్థి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా దగ్గరి సంబంధం ఉన్న సాంకేతిక రంగం విద్యనభ్యసిస్తూ ఉండాలి.
- మంచి అకడమిక్ మార్కులు కలిగి ఉండాలి.
అవసరమైన డాక్యుమెంట్లు..
-
దరఖాస్తు దారు విద్యా సంవత్సరంలో టెక్నికల్ ప్రాజెక్ట్‌లను మరియు
కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలలో అతని నేపుణ్యాన్ని తెలిపేలా
రెజ్యూమ్/CVని కలిగి ఉండాలి.
- ప్రస్తుత లేదా (ఏదైనా ఉంటే) మునుపటి సంస్థల నుంచి అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్.
- అభ్యర్థులు రెండు 400 పదాల వ్యాసాలను కూడా సమర్పించాలి. వ్యాసాలు ఆంగ్లంలో రాయాలి.
- ఈ వ్యాసాలు ఈక్విటీ, వైవిధ్యం, చేరిక మరియు ఆర్థిక అవసరాల పట్ల అభ్యర్థి నిబద్ధత, సామర్థ్యంపై అంచనా వేస్తాయి.
దరఖాస్తు చేసుకొనే విధానం..
Step 1 - ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Step 2 - ముందుగా https://buildyourfuture.withgoogle.com/scholarships/ లింక్‌లోకి వెళ్లాలి.
Step 3 - అందులో Generation Google Scholarship (Asia Pacific) లింక్‌ను ఎంచుకోవాలి.
Step 4 - ఇన్‌స్ట్రక్షన్‌లను పూర్తిగా చదివి Apply Now ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తుప్రారంభించాలి.
Step 5 - దరఖాస్తుకు డిసెంబర్ 10, 2021 వరకు అవకాశం ఉంది.
సాంకేతిక
విద్యలో మహిళలను ప్రోత్సహించడానికి ఈ స్కాలర్‌షిప్
ఉపయోగపడుతుంది. విద్యార్థుల ఎంపికలో కంపెనీదే పూర్తి బాద్యత.
స్కాలర్‌షిప్ నేరుగా విద్యార్థి ఖాతాలో పడుతాయి. ఆసక్తిగల
విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు
కామెంట్‌లు