SBI Personal Loan: కేవలం 4 క్లిక్స్‌తో రూ.20 లక్షల లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ... అప్లై చేయండి ఇలా
SBI Pre-approved Personal Loan | ఎస్బీఐలో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. కేవలం 4 క్లిక్స్తో పర్సనల్ లోన్ ఇస్తోంది ఎస్బీఐ.
కరోనా వైరస్ సంక్షోభంతో కష్టకాలంలో ఉన్నారా? ఆర్థిక
ఇబ్బందుల్లో ఉన్నారా? స్టేట్
బ్యాంక్ ఆఫ్
ఇండియా-SBI
అద్భుతమైన లోన్
ఆఫర్
ప్రకటించింది. కేవలం
4 క్లిక్స్తో
పర్సనల్ లోన్
ఇస్తామని ప్రకటించింది. గతంలో
కస్టమర్లు లోన్
తీసుకోవాలంటే చాలా
పెద్ద
ప్రాసెస్ ఉండేది.
బ్యాంకుకు వెళ్లి,
లోన్
దరఖాస్తు చేసి,
రోజుల
పాటు
ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ...
టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత
బ్యాంకులు వీలైనంత తక్కువ
సమయంలోనే రుణాలు
ఇస్తున్నాయి. ఎస్బీఐ కూడా పర్సనల్ లోన్
ఆఫర్
ప్రకటించింది. 4 క్లిక్స్తో
పర్సనల్ లోన్
ఇస్తోంది. అది
కూడా
తక్కువ
వడ్డీకే. కేవలం
9.60 శాతం
వడ్డీకే పర్సనల్ లోన్
ఇస్తామని ప్రకటించింది. కస్టమర్లకు రూ.20
లక్షల
వరకు
ప్రీ
అప్రూవ్డ్ లోన్స్
ఇస్తోంది ఎస్బీఐ.
గతంలో
పర్సనల్ లోన్
వడ్డీ
రేట్లు
12 శాతం
నుంచి
16 శాతం
మధ్య
ఉండేవి.
కానీ
ఇటీవల
వడ్డీ
రేట్లు
బాగా
తగ్గాయి. గతంలో
హోమ్
లోన్
వడ్డీ
రేట్లతో సమానంగా ఇప్పుడు పర్సనల్ వడ్డీ
రేట్లు
ఉన్నాయి. 10 శాతం
లోపే
పర్సనల్ లోన్
లభిస్తోంది. అయితే
ఇవి
ప్రీ
అప్రూవ్డ్ లోన్స్.
అంటే
కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్
లాంటివి పరిగణలోకి తీసుకొని తక్కువ
వడ్డీకే రుణాలను ఇస్తుంటాయి బ్యాంకులు. ముందుగానే రుణాలు
మంజూరు
చేసి
కస్టమర్లకు సమాచారం ఇస్తాయి. వీటినే
ప్రీ
అప్రూవ్డ్ లోన్స్
అంటారు.
కస్టమర్లు తమకు
అవసరమైతే ఈ
రుణాలను సులువుగా తీసుకోవచ్చు.
ఎస్బీఐ కస్టమర్లు తమకు
ప్రీ
అప్రూవ్డ్ లోన్
మంజూరైందా? లేదా?
అన్న
విషయాన్ని ఓ
ఎస్ఎంఎస్ ద్వారా
తెలుసుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు తమ
రిజిస్టర్డ్ మొబైల్
నెంబర్
నుంచి
PAPL అని
టైప్
చేసి
స్పేస్
ఇచ్చి
అకౌంట్
నెంబర్లోని చివరి 4 అంకెలు
టైప్
చేసి
567676 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి.
ఉదాహరణకు మీ
అకౌంట్
నెంబర్
చివర్లో 7890 అని
ఉంది
అనుకుంటే మీరు
PAPL 7890 అని
టైప్
చేసి
567676 నెంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి.
ప్రీ
అప్రూవ్డ్ లోన్
వర్తిస్తుందో లేదో
ఎస్ఎంఎస్ ద్వారా
తెలుస్తుంది. అందరికీ రూ.20
లక్షల
వరకు
ప్రీ
అప్రూవ్డ్ లోన్
రాకపోవచ్చు. కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, తిరిగి
చెల్లించే సామర్థ్యాన్ని బట్టి
ఇది
మారుతుంది.
ఇదొక్కటే కాదు... 7208933142 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చినా పర్సనల్ లోన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ బ్యాక్ వస్తుంది. లేదా SMS PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి. మరిన్ని వివరాలకు 1800112211 నెంబర్కు కాల్ చేయొచ్చు. లేదా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు. ఎస్బీఐ యోనో యాప్లో కూడా ప్రీఅప్రూవ్డ్ లోన్కు సంబంధించిన సమాచారం ఉంటుంది. యాప్లో Pre-approved Loan పైన క్లిక్ చేస్తే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎంత మంజూరైందో తెలుస్తుంది. అక్కడే మరిన్ని వివరాలు ఎంటర్ చేసి క్షణాల్లో రుణాలు పొందొచ్చు.
Gemini Internet
కామెంట్‌లు