రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలో చేతికి రూ.16 లక్షలు
ఇంట్లో కూర్చొని, మీ వద్ద ఉన్న పెట్టుబడితో మంచి రాబడిని పొందాలని
భావిస్తున్నారా? తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందాలనుకునే వారికి
పోస్టాఫీస్ పథకాలు చాలా ఉన్నాయి. పలు పోస్టాఫీస్ పథకాల్లో రిస్క్ తక్కువ,
రాబడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి పెట్టుబడుల్లో ఒకటి పోస్టాఫీస్ రికరింగ్
డిపాజిట్. పెట్టుబడి అంటే వ్యాపార సంబంధిత పదం. లాభం లేదా ఫలితం కోసం కొంత
మొత్తాన్ని ముందుగానే ఇన్వెస్ట్ చేయడం. రాబడి కోసం ముందస్తుగా పెట్టే
మొత్తాన్ని పెట్టుబడి అంటారు. బ్యాంకులు, స్టాక్ మార్కెట్, గోల్డ్
మార్కెట్, క్రిప్టో మార్కెట్.. ఇలా వివిధ రకాల పెట్టుబడులు ఉన్నాయి.
Gemini Internet
పోస్టాఫీస్ ఆర్డీ పథకం
పోస్టాఫీస్ RD డిపాజిట్ అకౌంట్ ద్వారా చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, అధిక వడ్డీ రేటుతో మంచి రిటర్న్స్ పొందవచ్చు. మీరు కనీసం రూ.100 మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. RD డిపాజిట్ అకౌంట్ పరిమితి అయిదు సంవత్సరాలు. బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ కాలపరిమితి ఆరు నెలలు ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీని లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని అకౌంట్ హోల్డర్ ఖాతాలోకి జమ చేస్తారు.
కామెంట్‌లు