12, నవంబర్ 2021, శుక్రవారం

Pension Alert: పెన్షన్ కావాలంటే నవంబర్ 30 లోగా ఆ సర్టిఫికెట్ ఇవ్వాలి ఇంటి నుంచే ఈ సర్టిఫికెట్ ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకోండి.

Pension Alert | పెన్షనర్లకు అలర్ట్. లైఫ్ సర్టిఫికెట్‌ను (Life Certificate) సమర్పించడానికి గడువు సమీపిస్తోంది. నవంబర్ 30 లోగా జీవన ప్రమాణ పత్రం (Jeevan Pramaan Patra) సమర్పించాలి.

ఈజీగా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోండి

ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ను SMS లేదా మిస్డ్ కాల్ ద్వారానూ తెలుసుకోవచ్చు. ‘EPFOHO UAN ENG’ అని టైప్ చేసి రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి SMS పంపాలి. మిస్డ్ కాల్ ద్వారా అయితే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కి ఫోన్ చేయాలి. ఈ కాల్ రింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అవుతుంది. కాసేపటి తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ ద్వారా వస్తాయి.

Gemini Internet

1. పెన్షన్​ పొందే రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగులు ఏటా జీవన ప్రమాణ పత్రం (లైఫ్​ సర్టిఫికెట్​) సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్యాంకులకు వెళ్లి లైఫ్​ సర్టిఫికెట్​ సమర్పించడం నిజంగా వృద్ధులకు ఇబ్బంది కలిగిస్తుంది. మరోవైపు, కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బయటకు వెళ్లేందుకు జంకే పరిస్థితి. ఇప్పుడు ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా కేంద్రం శుభవార్త చెప్పింది.

2. ఆన్​లైన్​ ద్వారానే లైఫ్​ సర్టిఫికెట్​ సమర్పించే అవకాశం కల్పించింది. రిటైనర్​ అయిన ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్​ పొందాలంటే ఏటా నవంబర్​ 1 నుంచి నవంబర్​ 30 మధ్య బ్యాంకులకు లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్ ఇంకా బతికే ఉన్నాడని సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుంది.

3. సర్టిఫికేట్‌ను అధీకృత పెన్షన్ పంపిణీదారు లేదా ఏజెన్సీ ముందు చూపించాలి. ఆ తర్వాత వారి ఖాతాలో పెన్షన్ జమ చేయబడుతుంది. పెన్షనర్లు తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాలను పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీస్ (PDA)ల వద్ద నేరుగా సబ్​మిట్​ చేయవచ్చు.

4. లేదంటే కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు అందిస్తున్న డోర్​ స్టెప్​ బ్యాంకింగ్​ సేవలను ఉపయోగించుకొని నేరుగా ఇంటి వద్దే ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అంతేకాదు, ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనూ సమర్పించే వెసులుబాటు కూడా ఉంది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (DSB) ద్వారా పెన్షనర్లు తమ లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్​ చేయవచ్చు.

5.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్​తో సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు డోర్​ స్టెప్​ బ్యాంకింగ్​కు మద్ధతిస్తున్నాయి. పింఛనుదారుడు ఈ సేవను పొందేందుకు గూగుల్​ ప్లేస్టోర్​ నుండి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా https://doorstepbanks.com/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 


6. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేందుకు పెన్షనర్లు ముందుగా తమ వివరాలను నమోదు చేయాలి. వ్యక్తి పెన్షన్ ఖాతా నంబర్‌ను ఎంటర్​ చేసి ధృవీకరించాలి. ఆ తర్వాత నామమాత్రపు ఛార్జీలు చెల్లించాలి. దీంతో, ప్రక్రియను పూర్తి చేయడానికి మీ ఇంటికి వచ్చే బ్యాంక్ ఏజెంట్ వివరాలు ఎస్​ఎమ్​ఎస్​ ద్వారా అందుకుంటారు. ఏజెంట్ వ్యక్తి ఇంటిని సందర్శించి, ప్రక్రియను పూర్తి చేస్తాడు. 

7. ఎలక్ట్రానిక్స్ అండ్​ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు పోస్ట్‌మ్యాన్ లైఫ్​ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి డోర్‌స్టెప్ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది. సేవను పొందేందుకు పెన్షనర్ పోస్ట్ ఇన్ఫో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తగిన ఫీజు చెల్లిస్తే పోస్ట్​ మ్యాన్ మీ ఇంటికే వచ్చి పెన్షన్​ సర్టిఫికెట్​ తీసకుంటారు. ఈ అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ అందుబాటులో ఉంటుంది.

 

కామెంట్‌లు లేవు: