IRCTC Shri Ramayana Yatra: శుభవార్త... ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని చేర్చిన రైల్వే
IRCTC Shri Ramayana Yatra | ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర టూరిస్ట్ రైలు భద్రాచలం రోడ్ స్టేషన్‌లో కూడా ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. భద్రాచలం సందర్శించిన తర్వాత ఢిల్లీకి రైలు బయల్దేరుతుంది.
Gemini Internet
తెలంగాణలోని శ్రీరామ భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చింది భారతీయ రైల్వే (Indian Railways). ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నవంబర్ 7న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన
సంగతి తెలిసిందే. ఈ యాత్రలో వెళ్లే భక్తులు రామాయణానికి సంబంధించిన
ప్రాంతాలన్నీ చూడొచ్చు. అయితే రామాయణానికి సంబంధం ఉన్న భద్రాచలాన్ని ఈ
యాత్రలో చేర్చకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో భారతీయ రైల్వే
కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని
కూడా చేర్చినట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ట్విట్టర్‌లో
వెల్లడించింది.
ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక రైలు
షెడ్యూల్ ప్రకారం రామేశ్వరం వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి
వెళ్లేదారిలో భద్రాచలం రోడ్ స్టేషన్‌లో ఆగుతుంది. భద్రాచలం ఆలయంతో పాటు
పరిసర ప్రాంతాల్లో రామాణయానికి సంబంధించిన ప్రాంతాలను యాత్రికులు
సందర్శించొచ్చు. ఆ తర్వాత రైలు ఢిల్లీకి బయల్దేరుతుంది.
కామెంట్‌లు