HPCL Recruitment 2021: ఇంజనీరింగ్ చేసిన వారికి శుభవార్త.. HPCLలో రూ. 25 వేతనంతో ఉద్యోగాలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నుంచి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. దరఖాస్తుకు డిసెంబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ HPCL (హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రంటీస్ ట్రైనీ ఖాళీలను (Graduate Apprentice Trainee Vacancies) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు మార్కెటింగ్ (Marketing) విభాగంలో పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇంకా వారు ఏడాది పాటు తత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. నేషనల్ అప్రంటీస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని అప్రూవల్ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయాన్ని నోటిఫికేషన్లో స్పష్టం చేయలేదు. ఈ కింది విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ని పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు.
1. సివిల్ ఇంజనీరింగ్ (Civil engineering)
2.మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical engineering)
3.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (Electrical engineering)
4.ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (Electrical and electronics engineering)
5.ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (Electronics and telecommunication engineering)
6.ఇన్ట్ర్సుమెంటేషన్ ఇంజనీరింగ్ (Instrumentation engineering)
7.కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Computer science engineering or information technology)

వయో పరిమితి:  18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, PwD అభ్యర్థులకు పదేళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు.
వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 25 వేల చొప్పను స్టైఫండ్ చెల్లించనున్నారు.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించిన తేదీ: నవంబర్ 22.
దరఖాస్తుల ప్రక్రియ ముగిసే తేదీ: డిసెంబర్ 6.

ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదట NATS పోర్టల్ లో ఎన్ రోల్ చేసుకోవాలి.
Step 2: అనంతరం USER lD/Email lD ఐడీ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
Step 3: లాగిన్ అనంతరం హోమ్ పేజీలో ‘‘ESTABLISHMENT REQUESTS’’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తార్వాత ‘‘Find Establishment’’ ను ఎంచుకోవాలి.

Step 4: తర్వాత Establishment Name ఆప్షన్ ను ఎంచుకుని ‘‘Hindustan Petroleum Corporation Limited’’ ను నైప్ చేసి Search ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: అనంతరం "Hindustan Petroleum Corporation Limited' కనిపిస్తుంది. సెలక్ట్ చేసి ‘‘Apply’’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 6: అనంతరం మీకు "Successfully applied for the training position" అనే మెసేజ్ కనిపిస్తుంది. దీంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

Gemini Internet

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.