17, నవంబర్ 2021, బుధవారం

PM KISAN MAAN DHAN: రైతులకు వృద్దాప్యంలో భరోసా.. రూ.3000 పెన్షన్

PM Kisan Maan Dhan: రైతుల వృద్దాప్య జీవితాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం పి ఎం కిసాన్ మన్ ధాన్ యోజన అనే పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది

PM Kisan MaanDhan: ఈ పథకం కింద, 60 సంవత్సరాల వయస్సు తర్వాత రైతులకు పెన్షన్ పొందే సౌకర్యం లభిస్తుంది 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళలోపు ఏ రైతు అయినా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కింద రైతుకు నెలకు రూ.3000 వరకు పించను లభిస్తుంది.

రైతుల వృద్దాప్య జీవితాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం పి ఎం కిసాన్ మన్ ధన్ యోజన అనే పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది

రైతులకు వృద్దాప్యంలో భరోసా పించన్

ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కింద రైతులకు 60 ఏళ్ళ తర్వాత పెన్షన్ ఇస్తారు. మీరు PM కిసాన్ మన్ ధన్ పథకంలో జాయిన్ అయ్యేందుకు ఖాతాదారు ఎలాంటి పత్రాలు సమర్పించనవసరం లేదు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో ఉన్న అనేక ప్రయోజనాలు

PM కిసాన్ మన్ ధన్ స్కీమ్ వెబ్ సైట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపు ఏ రైతు అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కింద రైతుకు నెలకు రూ.3000 వరకు పించను లభిస్తుంది.

PM కిసాన్ మన్ ధన్ యోజన కోసం అవసరమైన పత్రాలు

1.    ఆధార్ కార్డ్

2.    ఐడెంటిటీ కార్డ్

3.    వయస్సు దృవీకరణ పత్రం

4.    ఆదాయ దృవీకరణ పత్రం

5.    బ్యాంక్ కాతా పాస్ బుక్

6.    మొబైల్ నెంబర్

7.    పాస్ పోర్ట్ సైజు ఫోటో

ఇందుకోసం రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. PM కిసాన్ మన్ ధన్ కుటుంబ పెన్షన్ కూడా ఉంది. ఖాతాదారుడు మరణిస్తే అతని జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ లభిస్తుంది. కుటుంబ పెన్షన్ లో జీవిత భాగస్వామి మాత్రమే చేర్చబడ్డారు అని గుర్తుంచుకోవాలి.

PM కిసాన్ లబ్దిదారుడికి ఎలా ప్రయోజనం చేకూరుతుంది

PM కిసాన్ పథకం కింద, ప్రభుత్వం అర్హులైన రైతులకు 2000 రూపాయలతో 3 విడతలుగా ప్రతి సంవత్సరం  6000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తారు. దాని ఖాతాదారుల పెన్షన్ పథకం PM కిసాన్ మన్ ధన్ లో చేరాలనుకుంటే వారికి రిజిస్ట్రేషన్ సులభంగా చేయబడుతుంది. అలాగే రైతు ఈ ఎంపికను ఎంచుకుంటే, పెన్షన్ స్కీములో ప్రతి నెలా మినహాయించబడిన  కంట్రిబ్యూషన్ కూడా ఈ 3 వాయిదాలలో వచ్చిన మొత్తం నుండి తీసివేయడుతుంది. అంటే దీని కోసం PM కిసాన్ మన్ ధన్ ఖాతాదారుడు జేబులోంచి డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.

 Gemini Internet

 

కామెంట్‌లు లేవు: