6, నవంబర్ 2021, శనివారం

పత్రికా ప్రకటన తిరుమల, 2021 న‌వంబ‌రు 06

నవంబరు 13, 14, 15వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

తిరుప‌తి న‌గ‌రంలో నవంబరు 14వ తేదీన ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఉన్న నేప‌థ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.
ఈ కారణంగా నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

కామెంట్‌లు లేవు: