EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగం మారినా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ అవసరం లేదు
ఉగ్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ఫండ్ బదిలీపై ఈపీఎఫ్ఓ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఉద్యోగి ఉద్యోగాలు మారిన తరువాత కూడా పీఎఫ్ ఖాతా నెంబరు (PF Account Number) అదే కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో (PF Accounts) ఫండ్ బదిలీపై ఈపీఎఫ్ఓ (EPFO)కీలక నిర్ణయం తీసుకుంది. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేసిన కేంద్రీయ వ్యవస్థను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆమోదించింది. దీంతో ఉద్యోగి ఉద్యోగాలు(Jobs) మారిన తరువాత కూడా పీఎఫ్ ఖాతా నెంబరు అదే కొనసాగుతుంది. ఈపీఎఫ్ నిర్ణయంతో ఉద్యోగులు పీఎఫ్
ఖాతాలో ఫండ్ బదిలీ (PF Funds Transfer) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం
లేదని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు సెంట్రల్ డేటాబేస్ ద్వారా
కార్యక్రమాలు సాఫీగా సాగించడం, మెరుగైన సేవలను ఈపీఎఫ్‌ఓ అందించనుంది. ఈ
వ్యవస్థ ద్వారా పీఎఫ్ ఖాతాల డూప్లికేషన్ నివారించడం, ఖాతాల విలీనాన్ని సులభతరం చేస్తుంది.
ఈపీఎఫ్ తాజా నిర్ణయం ఏంటి?
సీ-డాక్ ద్వారా అభివృద్ధి చేసిన ఈ కేంద్రీకృత వ్యవస్థను ఈపీఎఫ్‌ఓ ఆమోదించినట్లు సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ‘‘సెంట్రల్ డేటాబేస్ ఆధారంగా ఈ విధానంలో పనులు దశల వారీగా ముందుకు సాగుతాయి. కార్యక్రమాలు సులభతరం చేయడంతోపాటు, మెరుగైన సేవలు పొందవచ్చు. ఒక వ్యక్తి రెండు మూడు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉండటం (Duplication), ఉద్యోగం మారినప్పుడు ఖాతాల్లో ఫండ్స్ బదిలీ అవసరాన్ని ఈ నూతన విధానం తొలగిస్తుందని’’రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ పత్రికా ప్రకటనలో తెలిపింది.
ప్రావిడెంట్, పెన్షన్ ఫండ్స్ కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే నిర్ణయాలు తీసుకునేలా తన సలహా సంస్థ ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (Finance Investment and Audit Committee)కి అధికారం కల్పించాలని ఈపీఎఫ్ఓ ( Employees Provident Fund Office) నిర్ణయించింది. భారత ప్రభుత్వం గుర్తించిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, కేస్ టు కేస్ ఆధారంగా పెట్టుబడుల పెట్టే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (FIAC)కి అధికారం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది
ఈపీఎఫ్ఓ అదనంగా నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఉద్యోగుల బోర్డు సభ్యులు, యజమానుల పక్షాల సభ్యులతోపాటు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. సంస్థలకు సంబంధించిన విషయాలపై కమిటీలు, సామాజిక భద్రతా అమలు కార్మిక,ఉపాధి మంత్రి అధీనంలో ఉంటుంది. డిజిటల్ బిల్డింగ్, పెన్షన్ సంబంధిత సమస్యలను యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ సెక్రటరీ పర్యవేక్షిస్తారు. ఈపీఎఫ్ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Central Board of Trustees) 229వ సమావేశం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.
EPFO తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పుడు PF ఖాతాదారులు ఖాతా బదిలీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO కొత్త నిర్ణయం ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే లేదా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి చేరినట్లయితే, అప్పుడు PF ఖాతాను బదిలీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పని ఆటోమేటిగ్గా చేయబడుతుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ద్వారా కేంద్రీకృత IT-ఎనేబుల్డ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఆమోదించింది. ఈ చర్యతో, ఉద్యోగం మారిన తర్వాత కూడా ఉద్యోగి యొక్క PF ఖాతా సంఖ్య శాశ్వతంగా ఒకటే ఉండే వీలు కలిగింది. EPFO తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పుడు PF ఖాతాదారులు ఖాతా బదిలీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO కొత్త నిర్ణయం ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే లేదా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి చేరినట్లయితే, అప్పుడు PF ఖాతాను బదిలీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పని ఆటోమేటిగ్గా చేయబడుతుంది. కేంద్రీకృత వ్యవస్థ సహాయంతో, ఉద్యోగి యొక్క ఖాతా విలీనం అవుతుంది. కేంద్రీకృత వ్యవస్థ PF ఖాతాదారుల వివిధ ఖాతాలను విలీనం చేయడం ద్వారా ఒక ఖాతాను సృష్టిస్తుంది.
ఒక ఉద్యోగి ఒక కంపెనీని విడిచిపెట్టి మరొక కంపెనీకి వెళ్లినప్పుడు, అతను PF
డబ్బును విత్‌డ్రా చేయడం లేదా మరొక కంపెనీకి బదిలీ చేయాలనేది ప్రస్తుతం
నియమంగా ఉంది. ఖాతాను బదిలీ చేసే పనిని ఉద్యోగి స్వయంగా చేయాల్సి ఉంటుంది.
శనివారం జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈపీఎఫ్‌ఓ వార్షిక డిపాజిట్లలో 5 శాతం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఇన్‌విట్‌లతో సహా ప్రత్యామ్నాయ పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఈపీఎఫ్‌వో సమావేశంలో నిర్ణయించారు.
కామెంట్‌లు