26, నవంబర్ 2020, గురువారం

నిరుద్యోగులకు శుభవార్త, నవంబర్ 28న జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సామర్లకోట నగరంలో ఈ నెల నవంబర్ 28వ తేదీన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి జాబ్ మేళా నిర్వహించనున్నారు.

ఈ జాబ్ మేళాను సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ (SIDAP) మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో జాబ్ చేయవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

జాబ్ మేళా నిర్వహించు తేదీనవంబర్ 28,2020
జాబ్ మేళా నిర్వహణ సమయం09:30 AM
జాబ్ మేళా నిర్వహణ ప్రదేశంTTDC ట్రైనింగ్ సెంటర్, సామర్లకోట,  తూర్పుగోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్.

ఉద్యోగాలు – వివరాలు :

న్యూ ల్యాండ్స్ లాబోరేటరీ సంస్థలో మాన్యుఫ్యాక్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలను( హైదరాబాద్ ) సామర్లకోటలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాల భర్తీకీ నిర్వహించే జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు 2018,2019,2020 సంవత్సరాలలో తాజాగా ఇంటర్మీడియట్ ఎంపీసీ /బైపీసీ కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన  లేదా  B. Sc కోర్సును మధ్యలో వదిలేసిన పురుష అభ్యర్థులు  ఈ జాబ్ మేళా కు హాజరు కావచ్చు.

వేతనం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 16,250 రూపాయలు జీతంగా లభించనుంది.

ముఖ్య గమనిక :

ఈ జాబ్ మేళా కు హాజరు కాబోయే అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ  విద్యా ప్రామాణిక  సర్టిఫికెట్స్  మరియు బయో డేటా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొదలైన పత్రాల నకళ్లును తమ వెంట తీసుకువెళ్ళవలెను.

 

కామెంట్‌లు లేవు: