28, నవంబర్ 2020, శనివారం

APPSC Group Mains Exams 2020 Update

 

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై అతిత్వరలో నిర్ణయం  :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నెల డిసెంబర్ 14,2020 నిర్వహించబోయే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష ను వాయిదా వేయాలంటూ గ్రూప్ -1 మెయిన్స్ కు కొత్తగా అర్హత సాధించిన సుమారు  1300 మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆశ్రయించారు.


నవంబర్ 11 న ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష పై  ఇచ్చిన తీర్పు తో నూతనంగా అర్హత సాధించిన 1300 మంది అభ్యర్థులు తమకు లభించిన  గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల అవకాశానికి సన్నద్ధం అవడానికి సమయం సరిపోదంటూ, అందువల్ల కనీసం మూడు (3)నెలల పాటు గ్రూప్ -1మెయిన్స్ పరీక్షలును వాయిదా వేయాలని, తద్వారా పరీక్షల ప్రిపరేషన్ కు సమయం దొరుకుతుంది అంటూ  అభ్యర్థులు ఏపీపీఎస్సీ ను అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.

దీనిపై స్పందించిన ఏపీపీఎస్సీ బోర్డు అధికారులు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణన లోకి తీసుకుని త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.

కామెంట్‌లు లేవు: