విద్యార్థులకు శుభవార్త :
ఆర్థికంగా వెనుక బడిన విద్యార్థిని, విద్యార్థులకు తమ చదువులకు కావాల్సిన ఆర్థిక భరోసాను కల్పించడంలో భాగంగా భారత కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే ప్రతిభ పరీక్షలు (NMMS, NTSE) కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS)-2020, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎక్సమినేషన్ (NTSE)-2020 ప్రతిభ పరీక్షల దరఖాస్తులకు గడువును పెంచారు.
NMMS -2020 మరియు NTSE -2020 ప్రతిభ పరీక్షల దరఖాస్తు గడువును డిసెంబర్ 20,2020 వరకూ పెంచారు.
తాజాగా వచ్చిన ఈ ప్రకటన తో విద్యార్థిని, విద్యార్థులు ఈ రెండు ప్రతిభ పరీక్షలు NMMS-2020, NTSE-2020 పరీక్షలకు డిసెంబర్ 20వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ప్రతిభ పరీక్షలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు విద్యార్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి