29, నవంబర్ 2020, ఆదివారం

🔳డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షా ఫలితాలు విడుదల


ఎస్‌.కె.విశ్వవిద్యాలయం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షా ఫలితాలను ఉపకులపతి రామకృష్ణారెడ్డి శనివారం వర్సిటీలోని తన ఛాంబర్‌లో ఫలితాలు విడుదల చేశారు. డిగ్రీ ఆరో సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు తప్పిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీకామ్‌, బీఎస్సీ, బీబీఎమ్‌లో ఒక్క సబ్జెక్టు తప్పినవారు మొత్తం 436 మంది విద్యార్థులకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో రెక్టార్‌ కృష్ణానాయక్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూషన్స్‌ చింతాసుధాకర్‌, కోఆర్డినేటర్‌ రఘునాథరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ లక్ష్మీరాం నాయక్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ శ్రీరాం నాయక్‌ పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: