22, నవంబర్ 2020, ఆదివారం

MIDHANI Assistant Fitter Jobs 2020 || మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

 మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 10వ తరగతి మరియు ఐటిఐ చదువును పూర్తి చేసుకుని  ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.

భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మినీ నవరత్న కంపెనీ -1 విభాగానికి చెందిన మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్ లో అసిస్టెంట్ ఫిట్టర్ (లెవెల్ -2) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదల అయినది. వాక్ – ఇన్ -ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఇరుతెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నిర్వహించబోయే ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీడిసెంబర్ 3, 2020
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం7:30 AM -11:00 AM

ఉద్యోగాలు – వివరాలు :

తాజాగా వెలువడిన ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఫిట్టర్ ( లెవెల్ -2 ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఉద్యోగాలు :

అసిస్టెంట్ ఫిట్టర్ (లెవెల్ -2) ఉద్యోగాలు20

అర్హతలు :

ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు ఎస్ఎస్సి, ఐటిఐ, ఎన్ ఏ సీ కోర్సు లలో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం అవసరమని ప్రకటనలో పొందుపరిచారు.

ఎంపిక విధానం :

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తదుపరి ఎంపికైన అభ్యర్థులకు వ్రాత పరీక్ష /ట్రేడ్ పరీక్షను నిర్వహిస్తారు.

జీత భత్యాలు – వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 24,180 రూపాయలును వేతనం గా పొందనున్నారు. ఈ వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కూడా అభ్యర్థులు పొందనున్నారు.

ఇంటర్వ్యూ నిర్వహణ – ప్రదేశం :

ఈ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లను ఈ క్రింది అడ్రస్ లో డిసెంబర్ 3వ తేదీన నిర్వహించనున్నారు.

అడ్రస్ :

Brahmaprakas Dav School,

MIDHANI Town Ship,

500058.

ముఖ్యగమనిక :

ఈ ఉద్యోగాలకు నిర్వహించే వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ వెంట విద్యా అర్హత ప్రామాణిక సర్టిఫికెట్స్, ఒక సెట్ ఫోటో కాపీస్, డేట్ ఆఫ్ బర్త్ మరియు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

Website

Notification

Apply Now

 

కామెంట్‌లు లేవు: