26, నవంబర్ 2020, గురువారం

TCS లో ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వికాస కార్యాలయం  ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రముఖ ఉద్యోగ సంస్థ TCS లో ఉద్యోగాలను కల్పించేందుకు ఆన్ లైన్ విధానం ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చింది.

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్ కు చివరి తేదీనవంబర్ 27,2020
ఉచిత శిక్షణ ప్రారంభ తేదీనవంబర్ 28,2020

ఉద్యోగాలు – వివరాలు :

TCS సంస్థలో BPS(బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ ) ఉద్యోగాలకు సంబంధించిన  60 రోజుల ఉచిత శిక్షణను వికాస ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇవ్వనున్నారు.

అర్హతలు :

ఈ శిక్షణకు BA/B. Com/B. Sc కోర్సు లను 2019-2020 సంవత్సరాలలో తాజాగా  పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

ఎంపిక – విధానం :

60 రోజుల శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు. ఈ ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు TCS సంస్థలో ఉద్యోగాలు కల్పించనున్నారు.

వేతనం :

టీసీఎస్ సంస్థల్లో బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయలు వేతనంగా అందనుంది.

ముఖ్యమైన గమనిక :

TCS సంస్థలో  ఉద్యోగాలకు సంబంధించిన 60 రోజుల ఉచిత శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు నవంబర్ 27వ తేదీ లోపు ఈ క్రింది ఫోన్ నంబర్స్ కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

ఫోన్ నంబర్స్ :

8019185102,

0884-2352765.

 

కామెంట్‌లు లేవు: