Aditya Polytechnic Lecturer Jobs 2020 Update || ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి వాక్ -ఇన్ -ఇంటర్వ్యూలు
ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి వాక్ – ఇన్ – ఇంటర్వ్యూలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో సూరంపాలెం లో ఉన్న ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన వెలువడినది.
ఈ ప్రకటన ద్వారా ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాక్ -ఇన్ -ఇంటర్వ్యూ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. Aditya Polytechnic Lecturer Jobs 2020 Update
ఉద్యోగాలు – వివరాలు :
ఈ ప్రకటనలో ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల (సూరంపాలెం ) లో Mech/ECE/Civil/EEE/CSE/Maths/English/ Physics/Chemistry డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆయా డిపార్టుమెంటులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నవంబర్ 23,2020 నుంచి నవంబర్ 27,2020 వరకూ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
విభాగాల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :
మెకానికల్ ఇంజనీరింగ్ | నవంబర్ 23, 2020 |
ఈసీఈ విభాగం | నవంబర్ 24, 2020 |
సివిల్ విభాగం | నవంబర్ 25, 2020 |
ఈఈఈ విభాగం | నవంబర్ 26,2020 |
కంప్యూటర్ సైన్స్ /మాథ్స్ /ఇంగ్లీష్ /ఫిజిక్స్ /కెమిస్ట్రీ | నవంబర్ 27, 2020 |
అర్హతలు :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలును కలిగి ఉండవలెను.
జీత భత్యాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు AICTE నార్మ్స్ ప్రకారం వేతనాలు పొందనున్నారు.మరియు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్, భోజన వసతి, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించనున్నారు.
ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం :
ఆదిత్య పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజెస్,
ADB రోడ్,
సూరం పాలెం.
సెల్ ఫోన్ నంబర్లు :
ఆదిత్య కళాశాల లో భర్తీ చేయబోయే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించే వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల గురించి మరింత ముఖ్యమైన సమాచారం కోసంఅభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను.
ఫోన్ నెంబర్స్ :
9502176667
9505518249
ముఖ్యగమనిక :
ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం అందుబాటులో కలదు.
ఆదిత్య కాలేజ్ బస్సులు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, రాజమండ్రి.మరియు ఆదిత్య అకాడమీ, శ్రీ నగర్, కాకినాడ నుండి బయలుదేరతాయి. ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు వీటిని వినియోగించుకోవచ్చునని ప్రకటన లో తెలిపారు.
కామెంట్‌లు