DRDO NMRL లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త.
భారతదేశ కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (DRDO) ఆధ్వర్యంలో ఉన్న నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (NMRL) లో 2020-21సంవత్సరానికి గానూ వివిధ విభాగాలలో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ వెలువడినది. DRDO Vacancies Update in telugu 2020
ఇరుతెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు కు చివరి తేదీ | డిసెంబర్ 7, 2020 |
ఉద్యోగాలు – వివరాలు :
తాజాగా వెలువడిన ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO ఆధ్వర్యంలో ఉన్న నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (NMRL) లో ఈ క్రింది విభాగాలలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా అప్రెంటిస్ ఖాళీలు :
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :
బీ. ఎస్సీ( కెమిస్ట్రీ ) | 4 |
బీఏ / బీ. కామ్ | 4 |
డిప్లొమో అప్రెంటిస్ :
డిప్లొమా ( మెకానికల్ ) | 2 |
డిప్లొమా (ఎలక్ట్రికల్ ) | 2 |
డిప్లొమా ( కంప్యూటర్ సైన్స్ ) | 1 |
డిప్లొమా ( పెయింట్ టెక్నాలజీ ) | 1 |
ఐటీఐ అప్రెంటిస్ :
ఐటీఐ ( పంప్ ఆపరేటర్ ) | 3 |
ఐటీఐ (ఫిట్టర్ ) | 3 |
ఐటిఐ (ఎలక్ట్రీషియన్ ) | 2 |
ఐటీఐ (ల్యాబ్ అసిస్టెంట్ ) | 2 |
ఐటిఐ ( వెల్డర్ ) | 1 |
ఐటిఐ (ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ ) | 1 |
10+2 అప్రెంటిస్ :
10+2 ఎనీ సబ్జెక్ట్ | 4 |
అర్హతలు :
ఈ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాలనూ అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ /డిప్లొమా /ఐటీఐ /10+2 కోర్సులలో ఉత్తీర్ణత సాధించవలెను.
దరఖాస్తు విధానం :
వెబ్సైటు లో ఉన్న దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తును నింపిన తర్వాత సంబంధిత విద్యార్హత సరిఫికేట్లను పిడిఎఫ్ రూపంలో సంబంధిత వెబ్సైటు లో అప్ లోడ్ చేయవలేను.
ఎంపిక విధానం :
ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అప్రెంటిస్ షిప్ కు ఎంపిక చేయనున్నారు.
జీత భత్యాలు :
విభాగాల వారీగా అప్రెంటిస్ లకు ఎంపికైన అభ్యర్థులుకు ఈ క్రింది విధంగా స్టైఫండ్ లభించనుంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 9000 రూపాయలు |
డిప్లొమా అప్రెంటిస్ | 8000 రూపాయలు |
ఐటీఐ అప్రెంటిస్ | 7000 రూపాయలు |
10+2 అప్రెంటిస్ | 7000 రూపాయలు |
ముఖ్య గమనిక :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను అభ్యర్థులు ఈ క్రింది మెయిల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
ఈమెయిల్ :
director@nmrl.drdo.in
కామెంట్‌లు