21, నవంబర్ 2020, శనివారం

Chalapathi Engg Walk-in-interview Jobs 2020 Update | చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ పోస్టుల భర్తీ

చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో  టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో ఉన్న చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (అటానమస్ ) కళాశాలలో వివిధ డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన వెలువడినది. Chalapathi Engg Walk-in-interview Jobs 2020 Update

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఉద్యోగాలు – వివరాలు :

తాజాగా జారీ అయిన ఈ ప్రకటన ద్వారా చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో CSE/CE/ME/ECE/Chemistry/English డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

CSE/CE/ME విభాగాలకు ఇంటర్వ్యూ నిర్వహణ తేదీనవంబర్ 22,2020,ఉదయం 9 గంటలకు
ECE/Chemistry/English విభాగాలకు ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:నవంబర్ 22,2020,మధ్యాహ్నం 1 గంటలకు

అర్హతలు :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులకు AICTE/UGC నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలు కలిగి ఉండవలెను. కేంద్రీయ యూనివర్సిటీ లలో పీజీ మరియు పీ. హెచ్ ఢీ లు చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా ప్రకటన లో పొందుపరిచారు.

జీత భత్యాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు  విద్యా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా వేతనాలను అందుకోనున్నారు.

ముఖ్య గమనిక :

ఈ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్ లను, విద్యా అర్హత సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీలను తమ వెంట తీసుకొని వెళ్లవలెను.

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ,

చలపతి నగర్,

లామ్, గుంటూరు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను.

ఫోన్ నంబర్లు :

ల్యాండ్ ఫోన్ : 0863-2524112 / 2524113.

మొబైల్ ఫోన్ :

9848083358/ 9440232740.

Website

 

కామెంట్‌లు లేవు: