ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోండి Take advantage of the job fair
ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోండి పెనుకొండ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, శ్రీపరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా సెప్టెంబరు 3న నిర్వహించే ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువత సద్వి నియోగం చేసుకోవాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు, ఏపీఎస్ఎస్డీసీ అధికారి ఖయ్యుంతో కలిసి జాబ్మేళాకు సంబంధించిన కరపత్రాలను ప్రదర్శించారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ పూర్తి చేసిన 35ఏళ్ల వయసున్న యువతీ, యువకులు అర్హులన్నారు. జాబ్మేళాలో 6కంపెనీలు పాల్గొంటాయ న్నారు. వివరాలకు స్కిల్స్టాబ్ సమన్వయకర్త శివప్రసాద్ను 9676706976లో సంప్రదించాలని సూచించారు. కళాశాల వైస్ప్రిన్సిపల్ జయప్ప తదితరలు పాల్గొన్నారు. Take advantage of the job fair Penukonda Town, Newsday: Minister Savitha has called upon the unemployed youth to take advantage of the job fair organized jointly by the State Skill Development Corporation and Sriparitala Sriramulu Government Degree College on September 3. On Friday, she displayed pamphlets ...