e-Paper వార్తా సమాచారం 15-08-2024

 


 

e-paper వార్తా సమాచారం 15-08-2024

AP MPHW Course: ఏపీలో ఎంపీహెచ్డబ్ల్యూ (ఫీమేల్‌) ట్రైనింగ్కోర్సు

GOVERNMENT JOBS

ఆన్లైన్లో హజ్ యాత్రకు దరఖాస్తులు

Indian Bank: ఇండియన్ బ్యాంకులో 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

19 నుంచి ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్

ఉచిత ఇసుక.. సులభమిక! బుకింగ్ కు  ప్రత్యేకంగా యాప్

రైల్వే శాఖలో పారా మెడికల్ ఉద్యోగాలు ఖాళీలు 1376

నిమ్స్ టెక్నీషియన్స్ ఖాళీలు 101

ఖాళీలు 300 చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పారామెడికల్ కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు

అంతర్జాతీయ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ అనంతపురం జిల్లా

యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన అనంతపురం జిల్లా

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు శ్రీ సత్యసాయి జిల్లా

నూతన కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం జిల్లా

AP MPHW Course: ఏపీలో ఎంపీహెచ్డబ్ల్యూ (ఫీమేల్‌) ట్రైనింగ్కోర్సు 

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి 58 ప్రభుత్వ/ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంపీహెచ్డబ్ల్యూ (మహిళలు) ట్రైనింగ్కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 30 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వివరాలు:

* మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (మహిళలు) ట్రైనింగ్కోర్సు

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

సీట్ల సంఖ్య: 2,330.

అర్హత: ఏదైనా గ్రూప్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: వెబ్సైట్లో సూచించిన దరఖాస్తు నమూనాను పూరించి, ధ్రువపత్రాల నకళ్లను సంబంధిత జిల్లా కేంద్రాల్లోని డీఎంహెచ్వో కార్యాలయాల్లో వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్పోస్టులో పంపాలి.

ముఖ్య తేదీలు… 

రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, ఆఫ్లైన్దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2024.

ఎంపిక జాబితా వెల్లడి: 15-10-2024.

తరగతుల ప్రారంభం: 21-10-2024.

ముఖ్యాంశాలు:
*
ఆంధ్రప్రదేశ్లో 58 ప్రభుత్వ/ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంపీహెచ్డబ్ల్యూ (మహిళలు) ట్రైనింగ్కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్వెలువడింది.

* ఇంటర్మీడియట్ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 30 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

https://cfw.ap.nic.in/

 

GOVERNMENT JOBS

వాటర్వేస్లో..

ఇన్ ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 37

పోస్టులు: అసిస్టెంట్ డైరెక్టర్, జేఏవో, డ్రైవర్, స్టోర్ కీపర్ తదితరాలు

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: సెప్టెంబర్ 15

WEBSITE: https://iwai.nic.in

 

టెక్నీషియన్లు..

బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఇండియా

(బీఈసీఐఎల్)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది

పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 68

పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్, టెక్నీషియన్, టెక్నీషియన్ (పర్ఫ్యూజన్ టెక్నాలజీ)

అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు

దరఖాస్తు: వెబ్సైట్లో

చివరితేదీ: ఆగస్టు 19

Website: https://www.becil.com

 

కానిస్టేబుల్ పోస్టులు..

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్)లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 819

పోస్టులు: కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్)

అర్హతలు: పదోతరగతితోపాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ సంబంధించిన కోర్సు చేసి ఉండాలి.

దరఖాస్తు: ఆన్లైన్లో సెప్టెంబర్ 2 నుంచి

చివరితేదీ: అక్టోబర్ 1

Website: https://www.itbpolice.nic.in

 

బామర్ లారీ-కంపెనీ లిమిటెడ్, కోల్కతాలో 39 పోస్టులు

కోల్కతాలోని బామర్ లారీ అండ్ కంపెనీ లిమి టెడ్(బామర్ లారీ లిమిటెడ్).. ఫిక్స్డ్ టర్మ్ ఒప్పం ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 39.

» పోస్టుల వివరాలు: మేనేజర్-02, అసిస్టెంట్ మేనేజర్-08, జూనియర్ ఆఫీసర్-20, ఆఫీసర్ -06, సీనియర్ కోఆర్డినేటర్-01, కస్టమర్ సర్వీస్ ఆఫీసర్-02.

» విభాగాలు: సేల్స్, ట్రావెల్, కమర్షియల్, బ్రాం చ్ ఆపరేషన్స్-క్లైంట్ సర్వీసింగ్, వీసా, లీజర్ తదితరాలు.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో

పాటు పని అనుభవం ఉండాలి.

» వయసు: మేనేజర్ పోస్టుకు 38 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు, మిగతా పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

» ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్,

మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

» పని చేయాల్సిన ప్రాంతాలు: హైదరాబాద్, బెంగ ళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 24.07.2024.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.

» వెబ్సైట్: http://https//www.balmerlawrie.com

ఎయిమ్స్ పాట్నాలో 76 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

పాట్నా(బిహార్)లోని ఆల్ ఇండియా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. సీని యర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 76.

» విభాగాలు: అనెస్తీషియాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, డెర్మటా లజీ, న్యూరాలజీ, బయో కెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడి సిన్ అండ్ బ్లడ్ బ్యాంక్ తదితరాలు.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, డీఎన్బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.08.2024.

>Examination Date: 02.09.2024.

» పరీక్ష కేంద్రం: ఎయిమ్స్ పాట్నా.

Interview Date: 03.09.2024, 04.09.2024.

>> Website: https://aiimspatna.edu.in

 

నేషనల్ హైవేస్ అథారిటీలో వివిధ ఉద్యోగాలు

ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండి యా(ఎన్ఏహెచ్ఎఐ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి

దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 04.

» పోస్టుల వివరాలు: హెడ్-ఏఎంసీ-01, ఫైనాన్షి యల్ ఎక్స్పర్ట్-01, ఐటీఎస్ (ఏటీఎమ్ఎస్ కమ్ టీఎమ్ఎస్) ఇంజనీర్ -01, ట్రాన్స్పోర్ట్ ఎకనా మిస్ట్(ట్రాఫిక్ టీమ్)-01.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో డిప్లొమా, డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎం బీఏ, ఎల్ఎల్బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

» వేతనం: నెలకు హెడ్-ఏఎంసీ పోస్టుకు రూ.6 లక్షలు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ పోస్టుకు రూ.5 లక్షలు, మిగతా పోస్టులకు రూ.2.35 లక్షలు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు 1 చేసుకోవాలి

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.08.2024.

>> website: https://nhai.gov.in

 

సీ-డ్యాక్, పుణెలో 250 పోస్టులు

పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) ఒప్పంద

ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 250.

» పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్-43, ప్రాజెక్ట్ ఇంజనీర్-100, ప్రాజెక్ట్ మేనేజర్-20, ప్రాజెక్ట్ ఆఫీసర్-03, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్-05, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్-79.

» విభాగాలు: సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరె న్సిక్స్, వీఎల్ఎస్ఐ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, ఎంబెడడ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఎడ్యుకే షన్ అండ్ ట్రైనింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్ తదితరాలు.

» అర్హత: సంబంధిత సబ్జెక్ట్ బీఈ/బీటెక్/పీజీ/ ఎంఈ/ఎంటెక్/పీహెచీ ఉత్తీర్ణులవ్వాలి.

» పనిచేయాల్సిన ప్రదేశాలు: పుణె, ఢిల్లీ, బెంగళూరు, సిమ్లా, థర్మశాల.

» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా _ ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 20.07.2024.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.

>> website: https://careers.cdac.in

 

ఎయిమ్స్ డియోఘర్ 15 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు

డియోఘర్(జార్ఖండ్)లోని ఆల్ ఇండియా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. ఒప్పం ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 15.

» పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీసర్( యుష్)-01, సీనియర్ మెడికల్ ఫిజిషిస్ట్-01, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్-01, మెడికల్ ఆఫీ సర్(ఆయుష్)-01, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ప్యూ జన్ ఆఫీసర్-01, సెక్యూరిటీ ఆఫీసర్-01, లా ఆఫీసర్-01, యోగా ఇన్స్ట్రక్టర్-01, శానిటేషన్ ఆఫీసర్-01, బయోమెడికల్ ఇంజనీర్-01, లాండ్రీ మేనేజర్-01, ఫైర్ టెక్నీషియన్-04.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎ స్సీ(యోగా/ఆయుష్), బీఈ/బీటెక్, పీజీ ఉత్తీర్ణ తతో పాటు పని అనుభవం ఉండాలి.

» వేతనం: నెలకు సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీని యర్ మెడికల్ ఫిజిసిస్ట్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్ పోస్టులకు రూ.1,01,550, శానిటేషన్ ఆఫీసర్, యోగా ఇన్స్ట్రక్టర్, బయో మెడికల్ ఇం జనీర్ పోస్టులకు రూ.67,350, లాండ్రీ మేనేజర్ పోస్టుకు రూ.53,100, ఫైర్ టెక్నీషియన్ పోస్టుకు 5.38,250, ລ້ ລ້ 5.84,150.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎయిమ్స్ డియో ఘర్, దేవీపూర్ క్యాంపస్, రామ్సాగర్, డియో ఘర్-814152 చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది: 19.08.2024.

» Website: www.aiimsdeoghar.edu.in

 

Indian Bank: ఇండియన్ బ్యాంకులో 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

చెన్నైలోని ఇండియన్ బ్యాంక్, ప్రధాన కార్యాలయం… 2024-25 సంవత్సరానికి కింది రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అప్లికేషన్ కోసం  సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్, హిందూపూర్ 9640006015 మొత్తం పోస్టులు 300 కాగా.. ఏపీ/ తెలంగాణ రాష్ట్రాల్లో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 2 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్: 300 పోస్టులు కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీ- 44; ఎస్టీ- 21; ఓబీసీ- 79; ఈడబ్ల్యూఎస్‌- 29; జనరల్ - 127. రాష్ట్రాల వారీగా ఖాళీలు: తమిళనాడు/ పుదుచ్చేరి- 160, కర్ణాటక- 35, ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ- 50, మహారాష్ట్ర- 40, గుజరాత్- 15. అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా తత్సమాన విద్యార్హత. వయోపరిమితి: 01/07/2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920. ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175. ఆన్లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్): రీజనింగ్ అండ్కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు- 40 మార్కులు), డేటా అనాలిసిస్ అండ్ఇంటర్ప్రెటేషన్ (35 ప్రశ్నలు- 60 మార్కులు). పరీక్ష వ్యవధి: 3 గంటలు. ప్రశ్నల సంఖ్య- 155. గరిష్ఠ మార్కులు- 200. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్/ సికింద్రాబాద్. ముఖ్య తేదీలు... ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 13.08.2024. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 02.09.2024 ముఖ్యాంశాలు: * ఇండియన్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌  వెలువడింది. * ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 2 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

 

ఆన్లైన్లో హజ్ యాత్రకు దరఖాస్తులు

హజ్ యాత్ర 2025కి మైనార్టీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగలవారు సెప్టెంబరు 9లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి చెందిన ముస్లిం సోదరులు అవకాశాన్ని వినియోగించుకోవాలని, యాత్రకు వయోపరిమితి లేదని పేర్కొన్నారు. శిశువులకు ప్రయాణం ఉచితం కాదని, విమాన చార్జీలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 2 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న దరఖాస్తుదారుడిని వయోజన యాత్రికుడిగా పరిగణిస్తామని తెలిపారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా హజ్కు అర్హత జీవిత కాలంలో ఒక్కసారే ఉంటుందని తెలిపారు. మెహ్రమ్ లేకుండా కేటగిరీలో, 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల స్త్రీలు నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళల సమూహాల్లో ప్రయాణించడానికి నిబంధనల ప్రకారం అనుమతిస్తామని మంత్రి వెల్లడించారు. హజ్ యాత్ర 2025లో ఒక యూనిట్కు కనీసం ఒకరు, గరిష్ఠంగా ఐదుగురు పెద్దలు, ఇద్దరు శిశువులు ఉండవచ్చని తెలిపారు. ఎంపికైన హజ్ యాత్రికులు మెడికల్ స్క్రీనింగ్, ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు www.hajcommittee.gov.in www.astatehajcommittee.com లో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు. సందేహాల నివృత్తి, సహాయం కోసం టోల్ ఫ్రీ నంబరు 1800-4257873.

19 నుంచి ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్

ఇంజనీరింగ్లో అడ్మిషన్లకు మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. నెల 19 నుంచి ప్రక్రియ ప్రారంభించనుంది. మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 19 నుంచి 21 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకో వచ్చు. 20 నుంచి 22లోగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. 23 ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుంది. 26 సీట్లు కేటా యిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు 26 నుంచి 30లోగా వి ద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి.

 

ఉచిత ఇసుక.. సులభమిక! బుకింగ్కు ప్రత్యేకంగా యాప్

» రవాణాకు ప్రభుత్వ వాహనాలు.. రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్

» జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కేంద్రాలు

» ఫిర్యాదుల కోసం 1800-599-4599

* టోల్ ఫ్రీ నెంబరు అందుబాటులోకి.. సమీక్షలో సీఎం నిర్ణయాలు

అమరావతి:- ఉచిత ఇసుకను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రత్యేకంగా యాప్ తీసుకురావడంతోపాటు.. ఇసుక రవా ణాకు ప్రభుత్వ వాహనాలనే సిద్ధం చేయనుంది. అదేవిధంగా అవకతవక లపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీనెంబరును కూడా అందుబా టులోకి తీసుకురానుంది. మేరకు సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పథకంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఇసుకను మరింత సులభంగా వినియోగదారులకు చేరువ చేయడంపై చర్చించారు.. వినియోగ దారులు ఇసుకను సుల భంగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీంతో వినియోగదారులు ఆన్లైన్లో యాప్లో గానీ, గ్రామ, వార్డు సచివాలయాల్లో గానీ ఇసుక బుక్ చేసుకునే వెలుసుబాటు ఉంటుందన్నారు. బుక్ చేసుకున్న తర్వాత తేదీన వారికి ఇసుక చేరుతుందో కూడా పేర్కొనాలని సూచించారు. ఇసుక సరఫరాలో మధ్యవర్తులకు చోటివ్వకూడదని అధికారులను ఆదేశిం చారు. థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా బయటకు వెళ్లే ఇసుకపై నిర్ణీత కాలవ్యవ థిలో ఆడిట్ జరపాలని సూచించారు. విజిలెన్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలన్నారు. అలాగే, ఇసుకను చేరవేయడానికి ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాల్లో గాని, వినియోగదారులు తమ సొంత వాహ నాల్లో గాని ఇసుకను రవాణా చేసుకునే ఏర్పాటు చేయాలన్నారు.. రవాణా చార్జీలను వినియోగదారులే నేరుగా వాహనాదారులకు చెల్లించేలా అవగా హన కల్పించాలని సూచించారు. దీనివల్ల రవాణా చార్జీలు స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీస్థాయిలో ఇసుక బుకింగ్ చేసుకోవడానికి ప్రత్యేక బుకింగ్ విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

మరిన్ని నిర్ణయాలు

భారీ స్థాయిలో ఇసుక కోరుకునే వినియోగదారులు. జీఎస్టీ సర్టిఫికెట్, అంత భారీమొత్తంలో ఇసుకతో ఏం పని చేస్తారు? ఎంత ఇసుక అవ సరం? ప్రాజెక్టు సైట్ వివరాలు ఆన్లైన్లో వెల్లడించాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వాధికారి సైట్ను సందర్శించి తన అభిప్రాయాలను కూడా ఆన్లైన్లో వెల్లడిస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే ఇసుక సరఫరా అవు తుంది. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ వ్యయం,

పన్నులు, సుంకాలు ఇతర చెల్లింపులను ఆన్లైన్లో చేయాలి. • ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు ప్రతి రీచ్లో థర్ట్ పార్టీ ఆడిట్ కమిటీలను నియమిస్తారు. రోజుకి ఒక రీచ్ నుంచి రవాణా చేయదగిన ఇసుక పరిమాణాన్ని ముందుగా నిర్ణయిస్తారు. మొదట బుక్ చేసుకున్న వారికి మొదటే ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి.

సీసీటీవీ కెమెరాల ద్వారా దీన్ని పర్యవేక్షించాలి. • ఇసుక రవాణా చేసే వాహనాలపై 'ఇసుక ఉచిత రవాణా వాహనం' అని రాయాల్సి ఉంటుంది. రియల్ టైమ్. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థతో వాహ నాలను అనుసంధానం చేయాలి. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలను బలో పేతం చేయాలి.

ఇసుక తవ్వకాలు, రవాణాను పర్యవేక్షించేందుకు గనుల శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. రియల్ టైమ్ లో ఇసుక రవాణాను పర్యవేక్షించేందుకు, వినియోగదారు లకు, వాహనదారులకు మధ్య సమన్వయం ఉండేలా ప్రతి జిల్లాలో ఇసుక రవాణా పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. • ఉచిత ఇసుక పథకంపై ఏవైనా ఫిర్యాదులుంటే ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4599కి కాల్ చేసి చెప్పవచ్చు. వినియోగదారుల నుంచి 24 గంటల పాటు ఫిర్యాదులు స్వీకరిస్తారు. పదకంపై ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకుంటూ సేవలు మెరుగు పరుస్తారు.

 

 

JOBS CORNER

ఖాళీలు 1376 రైల్వే శాఖలో పారా మెడికల్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు... దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

ఆర్ఆర్బో రీజియన్లు: అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్పూర్, అజ్మీర్, గోరఖ్ పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్ రాజ్, భోపాల్, జమ్మూ-శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్కతా, సికింద్రాబాద్, బిలాస్పూర్, మాల్డా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం.

పోస్టులు: డైటీషియన్(లెవల్-7), నర్సింగ్ సూపరిం టెండెంట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజీనిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలే రియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-3, ల్యాబొరేటరీ సూపరింటెండెంట్, పెర్ఫ్యూషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్(ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషి యన్, స్పీచ్ థెరపిస్ట్, కార్డియాక్ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-2, ఫీల్డ్ వర్కర్,

అర్హత:పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎ న్ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహి ళలు, ట్రాన్స్ జెండర్, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.500.

ఎంపిక: సీబీటీ(కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

రాత పరీక్ష, సబ్జెక్టులు: దీనిని 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రొఫెషనల్ ఎబిలిటీ(70 ప్రశ్నలు- 70 మార్కులు), జనరల్ అవేర్నెస్(10 ప్రశ్నలు-10 మార్కులు), జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జన రల్ సైన్స్(10 ప్రశ్నలు- 10 మార్కులు). ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు

17

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 16

WEBSITE: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281

 

నిమ్స్ టెక్నీషియన్స్ ఖాళీలు 101

హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)...ఒప్పంద ప్రాతిపది కన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబ యాలజీ, బయో మెడికల్, థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 36 ఏళ్లు మించకూడదు

వేతనం: నెలకు రూ.32,000

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/పీడ బ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా

చిరునామా: దరఖాస్తులను ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2 అంతస్తు, ఓల్డ్ ఒపీడీ బ్లాక్, నిమ్స్, పంజాగుట్ట చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 24

WEBSITE: https://www.nims.edu.in/

 

ఖాళీలు 300 చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం... కింద పేర్కొన్న రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్

కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీ-44, ఎస్టీ-21; ఓబీసీ-79; ఈడబ్ల్యూఎస్-29; జనరల్-127

రాష్ట్రాల వారీగా ఖాళీలు:

తమిళనాడు/పుదుచ్చేరి-160, కర్ణాటక-35, ఆంధ్రప్రదేశ్/తెలంగాణ-50, మహారాష్ట్ర-40, గుజరాత్-15.

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2024 జూలై 1 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష/ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా

ఇండియన్ బ్యాంక్లో ఆఫీసర్లు

దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 5.175

ఆన్లైన్ రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్): పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 155 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూట్ నుంచి 45 ప్రశ్నలు (60 మార్కులు), ! జనరల్/ ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు(40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 35 ప్రశ్నలు (40 మార్కులు), డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ నుంచి 35 ప్రశ్నలు (60 మార్కులు) వస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ /సికింద్రాబాద్.

ఆన్లైన్ రిజిస్ట్రేషను చివరి తేదీ: సెప్టెంబరు 2

WEBSITE https://www.indianbank.in/career/

 

పారామెడికల్ కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు

అనంతపురం (వైద్యం): ప్రైవేట్, ప్రభుత్వ పారా మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సులు చదువుకునేందుకు సంబంధించి దరఖాస్తు గడు వును సెప్టెంబరు 2 వరకు పొడిగించారని పారా మెడికల్ అసోసియే షన్ కన్వీనర్ డాక్టర్ కె.ఎస్. అబ్దుల్ రజాక్ గఫూర్ తెలిపారు. ఇంట ర్మీడియట్ పూర్తైన విద్యార్థులు పారా మెడికల్ కోర్సులు చేయవచ్చునని పేర్కొన్నారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, అప్తామలిక్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, అనస్తీషియా టెక్నీషియన్, ఆపరేషన్ థియే టర్ టెక్నీషియన్ వంటి తదితర 18 రకాల కోర్సులు ఉన్నాయని వీటిలో విద్యార్థులు చేరవచ్చునని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 18,754 సీట్లు ఉండగా ఇందులో సగం కూడా భర్తీ కాకపోవటంతో గడువును పొడి గించాలని అసోసియేషన్ తరపున అభ్యర్థించగా ఉన్నతాధికారులు స్పందించి దరఖాస్తు గడువును పెంచారని తెలిపారు.

 

అంతర్జాతీయ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్

అనంతపురం సెంట్రల్: జేఎన్టీయూ- బ్లెకింగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం (స్వీడన్) సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సహకార కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్ల వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్ సీఎ స్ఈ, ఈసీఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యర్థులు జేఎ న్టీయూ వెబ్సైట్లో లేదా కళాశాలలోని విదేశీ వ్యవహారాల డెరెక్టర్, అల్యూమినీ కార్యాలయంలో నెల 19 నుంచి 24లోగా సంప్రదించాలని కోరారు. ఇంటర్లో 60 శాతం మార్కులు ఉండడంతో పాటు జేఈఈ మెయిన్స్-2024, ఈఏపీసెట్లో పొందిన ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారని వివరించారు.

 

నూతన కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కళ్యాణదుర్గం గ్రామీణం, మండలంలోని బోరంపల్లి ప్రభుత్వ పాలిటె క్నిక్ కళాశాలలో నూతన కోర్సులు మంజూర య్యాయని, వాటి కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ కుమార్ ఒక ప్రక టనలో పేర్కొన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రెవిట్ ఆర్కిటెక్చర్ కొత్త కోర్సుల్లో చేరవచ్చు నని తెలిపారు. ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ చదివిన వారు అర్హులుగా తెలిపారు. కోర్సు పూర్తి అయితే ఏపీ టెక్నికల్ స్టేట్ బోర్డు వారు సర్టిఫికెట్లు జారీ చేస్తారని పేర్కొ న్నారు. ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకోవా లని తెలియజేశారు. వివరాలకు 83090 35309, 81061 07728 నంబర్లలో సంప్రదిం చాలని కోరారు.

 

 

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు

కళ్యాణదుర్గం గ్రామీణం, నిరుద్యోగ యువతీ, యువకుల కోసం నైపుణ్యా భివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు బోరం పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఆనందాజ్కుమార్ తెలిపారు. అసి స్టెంట్ ఎలక్ట్రిషియన్, అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులపై రెండు, మూడు నెలల్లో ఉచిత శిక్ష ణతో పాటు సర్టిపికెట్లు అందించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ ఆపై చదువులు చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ ఒరి జినల్, నకళ్లు, పాస్ఆఫొటోలతో పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 20 ఉదయం 10 గంట లకు హాజరు కావాలన్నారు.

యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన

పుట్టపర్తి గ్రామీణం, నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగు తుందని వెలుగు ఏపీఎం లక్ష్మీనారాయణ, జాబ్ కోఆర్డినేటర్ ఆంజనే యులు ప్రకటనలో తెలియజేశారు. 18 సంవత్సరాల వయసు ఉండి పది, ఇంటర్ ఉత్తీర్ణత పొందినవారు స్థానిక వెలుగు కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 96408 99337కి సంప్రదించాలని సూచించారు.

 

 

 


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015

Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్  అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి  Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-

 PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months

PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1.     Nominee ఫోటో
2.     Nominee ఆధార్
3.     అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో   
4.     అభ్యర్థి ఆధార్
5.     Original Bank Passbook
6.     UAN
7.     Password
8.     Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
·        Nominee Update కొరకు రూ.50/-
·        Password Update కొరకు రూ.50/-
·        UAN Activation కొరకు రూ.50/-
·        PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)

Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh