విద్యా ఉద్యోగ సమాచారం హాల్ టిక్కెట్లు ఫలితాలు 13-08-2024

ఏపీ గిరిజన వర్సిటీలో డిగ్రీ

విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (ఏపీ సీటీయూ)– డిగ్రీ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. బీఎస్సీ, బీబీఏ, బీకాం ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన సీయూఈటీ(యూజీ) 2024లో సాధించిన ర్యాంక్, కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఇవి ఆనర్స్/ఆనర్స్ విత్ రీసెర్చ్ ప్రోగ్రామ్లు.

ప్రోగ్రామ్లు: బీఎస్సీ(కెమిస్ట్రీ), బీఎస్సీ(బోటనీ), బీఎస్సీ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), బీఎస్సీ(జియాలజీ), బీబీఏ(టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్), బీకామ్(ఒకేషనల్).

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సీయూఈటీ(యూజీ) 2024 అర్హత తప్పనిసరి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 16

తరతులు ప్రారంభం: సెప్టెంబరు 9

వెబ్సైట్: www.ctuap.ac.in

 



ఏఐసీటీఈ సాక్షమ్ స్కాలర్షిప్ స్కీమ్

ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)– ‘సాక్షమ్ స్కాలర్షిప్ స్కీమ్ను ప్రకటించింది. టెక్నికల్ ఎడ్యుకేషన్పై దివ్యాంగులకు ఆసక్తిని కలిగించి, వారిని ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు స్కీమ్ను ఉద్దేశించారు. దీని ద్వారా కనీసం 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో స్కాలర్షిప్లు ఇస్తారు. అభ్యర్థులు పదోతరగతి/ఇంటర్ పూర్తిచేసిన రెండేళ్లలోపు ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థలో డిప్లొమా/డిగ్రీ ప్రవేశం పొంది ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అర్హత: డిప్లొమా కేటగిరీకి అప్లయ్ చేసుకోవాలంటే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. విద్యా సంవత్సరానికి మూడేళ్ల వ్యవధి గల టెక్నికల్ డిప్లొమా లెవెల్ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. ఐటీఐ కోర్సు పూర్తిచేసి లేటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/పన్నెండోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నాలుగేళ్ల వ్యవధి గల టెక్నికల్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. డిప్లొమా పూర్తిచేసి లేటరల్ ఎంట్రీ ద్వారా డిగ్రీ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందినవారు కూడా అర్హులే.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇతర మెరిట్ స్కాలర్షిప్స్ పొందుతున్నవారు, పీఎంఎస్ఎస్ఎస్ స్కీం కింద చదువుకుంటున్నవారు, నాన్ టెక్నికల్ కోర్సుల్లో చేరినవారు, డ్యూయెల్ డిగ్రీ/పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు, ఇతరత్రా స్టయిపెండ్/ఆదాయం పొందుతున్నవారు దరఖాస్తుకు అనర్హులు.

స్కాలర్షిప్: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.50,000 చెల్లిస్తారు. డిప్లొమా అభ్యర్థులకు మూడేళ్లు, డిగ్రీ అభ్యర్థులకు నాలుగేళ్లు స్కాలర్షిప్ ఇస్తారు. లేటరల్ ఎంట్రీకైతే డిప్లొమా అభ్యర్థులకు రెండేళ్లు, డిగ్రీ అభ్యర్థులకు మూడేళ్లు స్కాలర్షిప్ అందిస్తారు. స్కాలర్షిప్ మొత్తాన్ని ఏటా అభ్యర్థుల బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు. ఇందుకోసం బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్ తదితర ఖర్చుల కోసం స్కాలర్షిప్ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ఏటా చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా తరవాతి సంవత్సరాలకు వీటిని కొనసాగిస్తారు.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31

వెబ్సైట్: scholarships.gov.in

 

జేఎన్టీయూహెచ్లో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు

హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూహెచ్)కి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ అండ్ టీచింగ్(డీఐఎల్టీ)– ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది. ఒక్కో కోర్సు వ్యవధి ఆర్నెల్లు. ప్రతి కోర్సులో మూడు థియరీ సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్కు రెండు నెలల సమయం, 24 తరగతులు, మూడు క్రెడిట్లు నిర్దేశించారు. సాయంత్ర ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి. కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి. అదనంగా ఒక నెల ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆరు క్రెడిట్లు ఉంటాయి. కోర్సులో భాగంగా అసైన్మెంట్లు, ఎండ్ ఎగ్జామినేషన్ ఉంటాయి. అసైన్మెంట్లకు 40 శాతం, ఎండ్ ఎగ్జామినేషన్కు 60 శాతం వెయిటేజీ ఇస్తారు. ఫ్యాకల్టీ మెంబర్లు, ఉద్యోగస్తులు, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అడ్మిషన్స్ ఇస్తారు. యూనివర్సిటీకి చెందిన టీచింగ్&నాన్ టీచింగ్ సిబ్బంది, అకడమిక్ స్టూడెంట్స్కు కోర్సు ఫీజులో 40 శాతం రాయితీ లభిస్తుంది.

క్లౌడ్ అండ్ డెవోప్స్ కోర్సు: ఇందులో క్లౌడ్ టెక్నాలజీ ఏడబ్ల్యూఎస్ & మైక్రోసాఫ్ట్ అజ్యూర్, కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్/కంటిన్యూయస్ డిప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ సబ్జెక్టులు ఉంటాయి.

డేటా సైన్స్ అండ్ జనరేటివ్ ఏఐఎల్ఎల్ఎమ్ కోర్సు: ఇందులో పైథాన్ ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సబ్జెక్టులు ఉంటాయి.

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి డిప్లొమా/యూజీ/పీజీ పూర్తిచేసిన/చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్స్కు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం, ఏదేని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్పై అవగాహన తప్పనిసరి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 31

వెబ్సైట్: www.jntuh.ac.in

 

బీఎఫ్ఎస్సీలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ల గడువు

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఏపీ మత్స్య విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో 2024–25 బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్(బీఎఫ్ఎస్సీ)లో ప్రవేశానికి ఈనెల 20లోగా వర్సిటీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిజిస్ట్రార్ కోరారు. ఏపీ ఈఏపీసెట్–2024ర్యాంక్ వెబ్ కౌన్సిలింగ్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ముత్తుకూరులో 40, నరసాపురంలో 60 సీట్లు ఉండగా, అదనంగా 10 సీట్లు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేటాయిస్తారని, మొత్తం సీట్లలో 85% స్థానికులకు, 15% ఇతర రాష్ట్రాల అభ్యర్ధులకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

 

ఐఎంయూలో అసిస్టెంట్ ఉద్యోగాలు

చెన్నైలోని ఇండియన్ మారిటైం యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్మెంట్.. ప్రాతిపదికన కిందన పేర్కొన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీలు 27

అసిస్టెంట్: 15 పోస్టులు

అసిస్టెంట్(ఫైనాన్సింగ్): 12 పోస్టులు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీలో పరి జ్ఞానం ఉండాలి.

జీతం: నెలకు రూ.5,200 నుంచి రూ.20,200 వరకు,

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తదిత రాల ఆధారంగా

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.700, ఇత రులకు రూ.1000,

పని ప్రదేశం: చెన్నై, ముంబయి, కోల్కతా, విశాఖ పట్నం, కోచ్చి

పరీక్ష కేంద్రాలు: న్యూఢిల్లీ, లబ్నవూ, పట్నా, కోల్కతా, గువాహటీ, హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్, బెంగళూరు, ముంబయి, బోపాల్, జైపూర్.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 30 website: www.imu.edu.in/imunew/

 

Results and Hall tickets

UPSC ESIC Nursing Officer Recruitment 2024 Exam Result for 1930 Posts
https://doc.sarkariresults.org.in/SarkariResult_UPSC_RT_WR-1930-NursingOfcr-ESIC-engl-120824.pdf

IBPS Clerk XIV Recruitment 2024 PET Admit Card 2024 for 6128 Post
https://ibpsonline.ibps.in/crpcl14pet/login.php?appid=60e991978002e1c69340e4735a3b1f3a

NTA UGC NET / JRF June 2024 Check Exam City for August Exam 2024
https://ugcnet.ntaonline.in/frontend/web/cityintimationslip/city-intimation-july2024

 

డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

అనంతపురం సెంట్రల్, ఆగస్టు 12: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశా లకు సోమవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి కౌన్సెలింగ్లో ఉమ్మడి జిల్లాలో 13 ప్రభుత్వ, 60 ప్రైవేట్ కళాశాల లకు 10 సీట్లను కేటాయించారు. అలాట్మెంట్ అయిన విద్యా ర్థులు సంబంధిత కళాశాలలో 16కు రిపోర్ట్ చేసుకోవాలి. విద్యా ర్థులు ఇచ్చుకున్న ఆప్షన్ల మేరకు వారి ఇంటర్మీడియేట్ మార్కులు, కేటగిరి, మెరిట్ ఆధారంగా అటోమేటిక్ కంప్యూటరైజ్డ్ పద్ధతిలో సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే నచ్చిన కళాశాల, కోర్సులు కాకుండా ద్వితీయ ఆప్షన్స్లోలో అలాట్మెంట్ అయిన విద్యార్థులు చేరాలా? వద్దా? అంటూ సందిగ్ధంలో పడుతున్నారు. కళాశాలకెళ్లి భౌతికంగా రిపోర్ట్ చేయకుంటే కేటాయించిన సీటు రద్దు అవుతుం దని అధికారులు పేర్కొంటున్నారు. తొలి కౌన్సెలింగ్ ప్రక్రియ అనం తరం నిర్వహించే ద్వితీయ కౌన్సెలింగ్లో మరోసారి నచ్చిన కళా శాల, కోర్సులకు ఆప్షన్లు ఇచ్చుకోవాలంటే. ప్రస్తుతం ఆలామెంట్ అయిన సీట్ లో అడ్మిషన్ అవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

 

Web options నమోదుకు నేడు ఆఖరు

పీజీ డెంటల్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి కన్వీనర్, యాజమాన్య కోటా ప్రవేశాలకు రెండో దశ కౌన్సెలింగ్ కోసం వెన్ఆప్షన్ల నమోదుకు మంగళవారం రాత్రి 7 గంటల వరకు గడువు విధించారు. సోమవారం రాత్రి 7 గంటల నుం చి వెబ్తోప్షన్ల నమోదు ప్రక్రియను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ప్రారంభించింది

 

డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం రూరల్: డీఎస్సీ ఉచిత శిక్షణకు అర్హులైన ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మేరకు జిల్లా గిరిజన సం క్షేశాఖ అధికారి రామాంజనేయులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. నెల 13 తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులను అందజేయాలన్నారు. మూడు నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తామన్నారు. పూర్తి వివరాలకు జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

 

*♻️నేటి వార్తలు (13.08.2024)*

*నేటి ప్రత్యేకత:*

ప్రపంచ ఎడమ చేతివాటం ప్రజల దినోత్సవం

*అంతర్జాతీయ వార్తలు:*

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆదేశాలతో బంగ్లాదేశ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్లు ఇద్దరు మిన్న రాజీనామా చేశారు. అక్రమంగా కలిగి ఉన్న ఆయుధాలను ఈనెల 19 తేదీలోగా అప్పగించాలని ఆందోళనకారులకు బాంగ్లాదేశ్ హోం శాఖ సూచించింది.

క్షణంలోనైనా ఇజ్రాయిల్ పై దాడి చేసేందుకు ఇరాన్ సన్నాహాలు పూర్తిచేసిన తరుణంలో అమెరికా అణు జలాంతర్గామి ని పశ్చిమాసియాకు పంపుతున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు.

ఉక్రెయిన్ లోని భారీ అణు విద్యుత్ కేంద్రం జపొరిజియా లో ఆదివారం రాత్రి పేలుళ్ల శబ్దాలతో పాటు దట్టమైన నల్లని పొగలు వెలువడడంతో దీనిపై దాడి చేసినట్లు రష్యా ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

గ్రీస్ లోని చారిత్రక నగరం ఎథెన్స్ సమీపంలో కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండడంతో 500 మంది అగ్నిమాపక సిబ్బంది 152 ప్రత్యేక వాహనాలతో దీనిని ఆర్పివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

దక్షిణ తుర్కీయే లోని గోబెక్లి టిపి వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు 13,000 ఏళ్ల నాటి అతి పురాతనమైన క్యాలెండర్ ను కనుగొన్నారు.

రెండు ఇంజిన్లతో కూడిన 2 టన్నుల పే లోడ్ ను మోసుకెళ్లగల అతి పెద్ద మానవ రహిత విమానం (యూఏవి)ని చైనా విజయవంతంగా పరీక్షించింది.

డెంగీ వ్యాధి కేసులను తగ్గించడంలో నూతనంగా రూపొందించిన క్యూడెంగా టీకా 50 శాతానికి పైగా సమర్థతను చాటినట్లు ఇటలీ పరిశోధకులు ప్రకటించారు.

ఎస్ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ ను హౌసింగ్ కుంభకోణానికి సంబంధించి ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం నిన్న అరెస్టు చేసింది.

 

*జాతీయ వార్తలు:*

నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) క్రింద రూపొందించిన దేశంలో వివిధ విభాగాలలో ఉత్తమ విద్యా సంస్థల జాబితా 2024 కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న విడుదల చేశారు.

దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఐఐటీ మద్రాస్ వరుసగా ఆరవసారి అగ్రస్థానంలో నిలువగా, ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సి బెంగుళూరు వరుసగా తొమ్మిదవ సారి తొలి స్థానాన్ని సాధించింది.

బీహార్ లోని జహానాబాద్ జిల్లాలో బాబా సిద్దేశ్వర నాథ్ మందిరం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందగా 16 మందికి గాయాలయ్యాయి.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్ జి కార్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలి హత్య కేసును వారంలోగా పరిష్కరించనట్లయితే కేసును సిబిఐ కోప్పగిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.

భారతదేశ జనాభా 2016 నాటికి 952.2 కోట్లకు చేరనుందని ఇందులో మహిళల నిష్పత్తి 48.8% కు పెరుగుతుందని కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన 'ఉమెన్ అండ్ ఉమెన్ ఇన్ ఇండియా 2023" నివేదిక తెలియజేసింది

భూ పరిశీలన ఉపగ్రహం ఈవో ఎస్-08 నో ఈనెల 16 తేదీన స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ ఎస్ ఎల్ వి)- డి 3 ద్వారా ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిన్న ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం "పీఎం సూర్య ఘర్ - ముఫ్త బిజిలి యోజన" లో భాగంగా "ఆదర్శ సౌర గ్రామం" కాంపోనెంట్ ను అమలు చేసేందుకు నిన్న కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ మార్గదర్శకాలని విడుదల చేసింది.

*రాష్ట్ర వార్తలు:*

రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 2 తేదీ నాటికి పదివేల కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

రైతులకు గత రబీకి సంబంధించిన రూ674 కోట్ల బకాయిలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరులో విడుదల చేశారు.

ఇంటింటికి కుళాయి కనెక్షన్లపై రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పల్స్ సర్వేలో పెళ్లి రోజు 80 వేల నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వివరాలు సేకరించారు.

నిన్న ఎన్ఎస్ఐఆర్ఎఫ్ విడుదల చేసిన దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో ఆంధ్ర యూనివర్సిటీ 41 స్థానాన్ని విశ్వవిద్యాలయాల ర్యాంకులలో 25 స్థానాన్ని సాధించింది.

మావోయిస్టు పార్టీ దాని అనుబంధ సంఘాల పై నిషేధాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

పాఠశాలలకు పిల్లల్ని చేరవేసే వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని దీనికోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రవాణా శాఖ అధికారులకు సూచించారు.

అసెంబ్లీ నియోజకవర్గాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్సర్షిప్ (పిపిపి) విధానంలో స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనల రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మిగులు ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ పై ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ను 17 తేదీ వరకు పొడిగించింది.

ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంలో ఫిషరీస్ సైన్స్ (బి ఎఫ్ ఎస్ సి) కోర్సులో ప్రవేశానికి నెల 20 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్టర్ తెలియజేశారు.

రాష్ట్రంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రాథమిక పాఠశాలలలో అంగన్వాడీలను కలిపి రాష్ట్రవ్యాప్తంగా 41 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ఫౌండేషన్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 

*క్రీడావార్తలు: .*

ఒలింపిక్స్ లో తన అనర్హతపై భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ చేసిన అప్పీలపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) నేడు తీర్పు వెలువరించనుంది.



 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.