GATE: గేట్‌లో టాప్‌ స్కోరుకు వ్యూహం! సన్నద్ధతకు మెలకువలు | HOW TO GET TOP SCORE IN GATE EXAMINATION INDIA Awake to prepare | GATE: GATE में सर्वोच्च अंक प्राप्त करने की रणनीति! तैयारी के लिए जागें.


GATE: గేట్‌లో టాప్‌ స్కోరుకు వ్యూహం! సన్నద్ధతకు మెలకువలు

ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ విద్యార్థుల పైచదువులకైనా, వారి ఉద్యోగ సాధనకైనా గేట్‌ స్కోరు అవసరం. ఈనెల 24న ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఆరంభం కాబోతోంది. ఈ పరీక్షకు శాస్త్రీయ విధానంలో సన్నద్ధమై మెరుగైన స్కోరు సాధించటమెలాగో తెలుసుకుందాం! 
     కొందరు చదివిన అన్ని అంశాలూ గుర్తుంటాయని భావించి పునశ్చరణ (రివిజన్‌)ను విస్మరిస్తారు. కానీ గేట్‌ సన్నద్ధతలో ఇది అత్యంత కీలకమైందని మర్చిపోకూడదు 
     గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)లో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త పేపర్లను ప్రవేశపెట్టడం, సిలబస్‌లో మార్పులు, బీఎస్సీ విద్యార్థులూ పరీక్షను రాసే అవకాశం కల్పించడం లాంటివి చూశాం. ఈసారి జరగబోయే గేట్‌కు ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీఎస్సీ విద్యార్థులు రాసే అవకాశం కల్పించారు. 
* సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ గేట్‌ను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ తరపున ఐఐఎస్‌సీ బెంగుళూరు, 7 ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఐఐటీ రవుర్కెలా ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. 
* గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఐఐటీలతోపాటు ఐఐఎస్‌సీ బెంగుళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో.. టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీ విభాగాల్లో ఉన్నత విద్యలో ప్రవేశం లభిస్తుంది. ఈ స్కోరుతో కేంద్ర ప్రభుత్వ కొలువులను సొంతం చేసుకోవచ్చు. మేటి జీతభత్యాలతోపాటు ఉద్యోగ భద్రత అందించే మహారత్న, నవరత్న, మినీరత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థల్లో, కొన్ని ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు గేట్‌ స్కోరు ప్రామాణికంగా తీసుకుంటారు.  
* గేట్‌-2025ను 30 పేపర్లలో నిర్వహించనున్నారు.అభ్యర్థులు ఒకటి లేదా రెండు పేపర్లలో పరీక్ష రాసుకోవచ్చు. రెండు పేపర్లలో పరీక్ష రాయాలనుకుంటే.. రెండో పేపర్‌ ఎంపిక మొదటి పేపర్‌పై ఆధారపడి ఉంటుంది. గేట్‌ స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాలు, పీఎస్‌యూలకు ఒకటి లేదా రెండు సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది. 
* గేట్‌తో మన దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశంతోపాటు నెలకు రూ.12,400 ఉపకార వేతనం లభిస్తుంది. దీని స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా ఉపయోగపడుతుంది. నెలకు రూ.28,000 ఉపకార వేతనం కూడా లభిస్తుంది.

దరఖాస్తు 
ఐఐఎస్‌ఎసీ, ఐఐటీల్లో ఏదో ఒక గేట్‌ జోనల్‌ వెబ్‌సైట్‌లోని గేట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (జీఓఏపీఎస్‌)ను ఉపయోగించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
వెబ్‌సైట్‌: https://gate2025.iitr.ac.in
గమనిక: రెండు పేపర్లలో పరీక్ష రాయదలిచిన అభ్యర్థుల రెండు పేపర్‌లకు విడివిడిగా పరీక్ష రుసుమును చెల్లించాలి. 

పరీక్ష విధానం 
* గేట్‌-2025 పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 1, 2, 15, 16. 
* గేట్‌ ప్రశ్నపత్రంలో మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలు ఉంటాయి. 
ఆన్‌లైన్‌ పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. 

విభాగం-1 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌):
* ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఐదు ఒక మార్కు ప్రశ్నలు, మరో ఐదు రెండు మార్కుల ప్రశ్నలు. ఈ విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లిష్‌ సంబంధమైనవి (వెర్బల్‌ ఎబిలిటీ), మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్‌కు సంబంధించినవి ఇవ్వొచ్చు. 
* రోజువారీ వార్తాపత్రికలు చదవడం, క్యాట్‌ లాంటి ఇతర పోటీ పరీక్షల గత ప్రశ్నపత్రాలు సాధన చేయడం 
ఈ విభాగంలో మంచి మార్కులు సంపాదించడానికి ఉపయోగపడతాయి. 
విభాగం-2: (సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు)
* ఈ విభాగంలో 55 ప్రశ్నలుంటాయి. ఇందులో 25 ఒక మార్కు ప్రశ్నలు, 30 రెండు మార్కుల ప్రశ్నలుంటాయి. 
గణితం: 10 నుంచి 15 మార్కులు. అయితే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు. 
ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌తో ఉంటాయి. ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. 

ప్రశ్నలు మూడు రకాలు
గేట్‌ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు రకాలుగా ప్రశ్నలు అడుగుతారు.
1. బహుళైచ్ఛికం: ఒక్కో ప్రశ్నకు నాలుగు ఆప్షన్ల జవాబులు ఇస్తారు. అందులో ఒకటి మాత్రమే సరైనది. దాన్ని మాత్రమే గుర్తించాలి. 
2. బహుళ ఎంపిక: ఇవీ బహుళైచ్ఛిక ప్రశ్నల్లానే ఉంటాయి. కానీ ఇందులో ఒకటికంటే ఎక్కువ సరైన ఆప్షన్లుంటాయి. అన్ని సరైన ఆప్షన్లనూ సమాధానంగా గుర్తించాలి. 
3. న్యూమరికల్‌: ఈ ప్రశ్నల్లో ఎటువంటి ఆప్షన్లూ ఇవ్వరు. సమాధానాలను వర్చువల్‌ కీ బోర్డును ఉపయోగించి రాయాలి. సమాధానం రాసేటప్పుడు తగిన శ్రద్ధ చూపాలి. ఎందుకంటే సమాధానంలో పక్కన యూనిట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 
     సరైన సమాధానం 68.53 అనుకుందాం 68.52 నుంచి 68.54 మధ్యలో రాసినా మార్కులు ఇస్తారు.

నెగిటివ్‌ మార్కులతో జాగ్రత్త
* గేట్‌లో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున. న్యూమరికల్, బహుళ ఎంపిక ప్రశ్నలకు ఈ మైనస్‌ మార్కులుండవు. 
* పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్, మొబైల్‌ ఫోన్‌లను అనుమతించరు. ఆన్‌లైన్‌ వర్చువల్‌ కాలిక్యులేటర్‌ అందుబాటులో ఉంటుంది. దీనిలో అన్నిరకాల ఫంక్షన్స్‌ లేకపోవడం వల్ల తదనుగుణంగానే ప్రశ్నలు రూపొందిస్తారు. ఇమాజినరీ ఫంక్షన్స్, హైయర్‌ ఆర్డర్‌ సమీకరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవచ్చు.

సన్నద్ధత ప్రణాళిక
1 గేట్‌-2025 ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇప్పుడున్న వ్యవధిలో ప్రిపరేషన్‌ పూర్తిచేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. దీనిలో పునశ్చరణకు కూడా ఎక్కువ సమయం కేటాయించాలి. 
సన్నద్ధత ప్రణాళికలో అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇవ్వాలి. కాకపోతే పరీక్ష సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఏయే సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. 
దీంతోపాటు పరీక్ష విధానాన్ని అర్థంచేసుకోవడం కూడా ముఖ్యమే. దీనివల్ల పరీక్షలోని విభాగాలపైనా, ప్రశ్నల సాధనపైనా స్పష్టత వస్తుంది. 
చాలా ముందుగానే సన్నద్ధతను మొదలుపెడితే సంబంధిత మెటీరియల్‌ను సమకూర్చుకోవచ్చు. సిలబస్‌లో ఉన్న కాన్సెప్టులు, విషయాలను ఎక్కువగా సాధన చేసుకోవచ్చు.
గత గేట్‌ ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా సాధన చేయాలి. దీనివల్ల ఏ అంశాలకు, ఏ కాన్సెప్టుకు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారో అర్థమవుతుంది.  
ఈఎస్‌ఈ, ఇస్రో, పీఎస్‌యూ నియామక ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగడానికి అవకాశం ఉందో తెలుస్తుంది.
మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలనూ, అధ్యయన సామగ్రినీ (స్టడీ మెటీరియల్‌) ఎంచుకోవడం ప్రధానం. ఒకే అంశంపై రకరకాల పుస్తకాలను చదవకపోవడం మంచిది.
క్లిష్టమైన, సాధారణ, అతి సాధారణ అంశాలకు కూడా ప్రిపరేషన్లో ప్రాధాన్యం ఇవ్వాలి. 
ప్రతి చాప్టర్, సబ్జెక్టు చదివాక దానికి సంబంధించిన ప్రముఖ విద్యా సంస్థలు అందించే ఆన్‌లైన్‌ టెస్టులను రాయాలి. ప్రిపరేషన్‌ పూర్తయ్యాక మాదిరి ప్రశ్నపత్రాలను (మాక్‌ టెస్టులు) రాయాలి. దీనివల్ల తమ సన్నద్ధత ఎలా ఉందో అభ్యర్థులకు అర్థమవుతుంది.
10 చాప్టర్‌వైజ్, సబ్జెక్టువైజ్, మాక్‌ టెస్టులు, నమూనా ప్రశ్నపత్రాలు రాసినప్పుడు తప్పుగా రాసిన ప్రతి సమాధానాన్నీ సవరించుకోవాలి. వాటిపై ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి. 
11 ఎన్‌పీటీఎల్‌ పాఠాలతో విద్యార్థులకు ప్రాథమిక అంశాల అవగాహన వస్తుంది. విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికీ ఉపయోగపడతాయి. 
12 కొందరు విద్యార్థులు మొదట్లో సిలబస్‌ని చూసి భయపడుతుంటారు. కానీ నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ సిలబస్‌తో పోలిస్తే గేట్‌ సిలబస్‌ 60 శాతం మాత్రమే. 
13 మొత్తం ఇంజినీరింగ్‌ బ్రాంచికి సంబంధించిన మూలాలు, కొత్త పోకడలు మాత్రమే గేట్‌ సిలబస్‌లో ఉంటాయి. ఒక పెద్ద కొండ సైతం రోజుకో బండ తొలగిస్తే కొంతకాలానికి మటుమాయం అవుతుంది. రోజుకు రెండు నుంచి మూడు గంటలు ఒక్కో కాన్సెప్ట్‌ అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే అందుబాటులో ఉన్న సమయంలోనే సిలబస్‌ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. 
14 చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. సన్నద్ధత సమయంలో ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్‌కు సంబంధించి క్లుప్తంగా తయారుచేసుకున్న అంశాలనూ, చిన్నచిన్న పట్టికలనూ ఈ సందర్భంగా సద్వినియోగం చేసుకోవాలి.

GATE: Strategy for top score in GATE!
Engineering, Architecture, Pharmacy students need GATE score for higher studies and their job search. Online application process is going to start on 24th of this month. Let's learn how to prepare scientifically for this exam and score better!
 Some skip revision thinking that they will remember all the material they read. But don't forget that it is very important in gate preparation
 There have been many changes in the Graduate Aptitude Test in Engineering (GATE) over the past few years. We have seen the introduction of new papers, changes in the syllabus and the opportunity for BSc students to write the exam. MBBS/ BDS/ BSC students have been given an opportunity to write for the gate to be held this time.
* This GATE, which has a long history, is organized annually under the joint auspices of IISC Bangalore and 7 IITs on behalf of the Ministry of Human Resource Development, Ministry of Higher Education. This year it will be held under the auspices of IIT Ravurkela.
* Admission to higher education in technology/architecture/pharmacy departments is available in IITs, IISC Bangalore, various NITs, leading engineering colleges on the basis of GATE score. With this score one can own Central Govt. GATE score is taken as a standard for job placements in public sector organizations and some private organizations which have got Maharatna, Navaratna and Miniratna status, which provide job security along with higher salaries.
* GATE-2025 will be conducted in 30 papers. Candidates can appear in one or two papers. If you want to write the exam in two papers.. the choice of the second paper depends on the first paper. GATE score is valid for three years for PG admission and one or two years for PSUs.
* With GATE you will get admission in PG courses in all the higher educational institutions of our country along with a stipend of Rs.12,400 per month. Its score is also useful for PhD admissions. A stipend of Rs.28,000 per month is also available.
Application
In IISAC and IITs, the application should be filled online and registered using the GATE Online Application Processing System (GOAPS) on the GATE zonal website.
Website: https://gate2025.iitr.ac.in
Note: Candidates who wish to appear in both papers will have to pay the examination fee separately for both the papers.
Test procedure
* GATE-2025 Exam Dates: February 1, 2, 15, 16.
* GATE question paper will have 65 questions for total 100 marks.
Duration of online test is three hours. The question paper has two sections.
Section-1 (General Aptitude):
* It consists of ten questions. Five are one mark questions and five are two mark questions. Four to five questions in this section are related to English (Verbal Ability) and the remaining questions are related to Quantitative.
* Reading daily newspapers, practicing past papers of other competitive exams like CAT
Good marks are useful in this section.
Section-2: (Related Engineering Subjects)
* There are 55 questions in this section. It consists of 25 one mark questions and 30 two mark questions.
Mathematics: 10 to 15 marks. But the questions in this section are not pure maths.
with engineering applications. The questions are designed keeping in mind the innovations in the respective fields.
There are three types of questions
GATE question paper is objective mode. In this three types of questions are asked.
1. Multiple Choice: Each question will have four options to answer. Only one of them is correct. Just figure it out.
2. Multiple Choice: These are similar to multiple choice questions. But it has more than one correct option. Mark all the correct options as answers.
3. Numerical: No options are given in these questions. Answers should be written using the virtual keyboard. Be careful while writing the answer. Because adjacent units are also taken into account in the answer.
 Suppose the correct answer is 68.53, marks will be given if written between 68.52 to 68.54.
Be careful with negative marks
* One wrong answer in GATE carries 33.33 percent credit marks. That means 1/3 for one mark questions and 2/3 for two mark questions. Numerical and multiple choice questions do not carry these minus marks.
* Calculator and mobile phones are not allowed in the examination center. An online virtual calculator is available. Due to the absence of all kinds of functions in it, questions are formulated accordingly. Questions related to imaginary functions, higher order equations may not be asked.
Preparation plan
1 GATE-2025 will be held in February. A plan should be made so as to complete the preparation in the present period. In this, more time should also be allocated for revision.
2 All subjects should be given priority in preparation plan. If not then one should go through the exam syllabus thoroughly and decide which subjects should be given more priority.
3 It is also important to understand the test procedure. This will give clarity on the sections of the exam and the practice of the questions.
4 If the preparation starts very early then the relevant material can be procured. Practice more of the concepts and material in the syllabuscan do
5 Previous GATE question papers must be practiced. This will make it clear which topics and concepts have been prioritized.
6 ESE, ISRO, PSU recruitment question papers should be practiced. This shows how many ways a subject can be asked.
7 Choosing good quality textbooks and study material is important. It is better not to read different books on the same topic.
8 Difficult, simple and even very simple topics should be given priority in preparation.
9 After reading each chapter and subject, write online tests provided by leading educational institutions. After completion of preparation write the model question papers (mock tests). This will help the candidates understand how their preparation is.
10 While writing Chapterwise, Subjectwise, Mock Tests and Sample Papers, every wrong answer should be corrected. They should be practiced with special attention.
With 11 NPTL lessons, students will get an understanding of the basics. Also useful for writing answers to analytical questions.
12 Some students are initially afraid of the syllabus. But GATE syllabus is only 60 percent compared to four year engineering syllabus.
13 GATE Syllabus covers only the basics and new trends of the entire engineering branch. Even a big hill, if a rock is removed every day, it will disappear for some time. If you go ahead and understand each concept for two to three hours a day, you can understand the syllabus completely within the available time.
14 Every subject studied must be reviewed. During the preparation, the topics and small tables prepared in brief for each subject and each chapter should be utilized on this occasion. 

GATE: GATE में सर्वोच्च अंक प्राप्त करने की रणनीति!
तैयारी के लिए जागें.
इंजीनियरिंग, आर्किटेक्चर, फार्मेसी के छात्रों को उच्च अध्ययन और नौकरी खोज के लिए GATE स्कोर की आवश्यकता होती है। ऑनलाइन आवेदन प्रक्रिया इसी महीने की 24 तारीख से शुरू होने जा रही है. आइए जानें कि इस परीक्षा के लिए वैज्ञानिक तरीके से तैयारी कैसे करें और बेहतर स्कोर कैसे करें!
 कुछ लोग यह सोचकर दोहराना छोड़ देते हैं कि उन्हें पढ़ी गई सारी सामग्री याद रहेगी। लेकिन यह मत भूलिए कि गेट की तैयारी में यह बहुत महत्वपूर्ण है
 पिछले कुछ वर्षों में ग्रेजुएट एप्टीट्यूड टेस्ट इन इंजीनियरिंग (GATE) में कई बदलाव हुए हैं। हमने नए पेपरों की शुरूआत, पाठ्यक्रम में बदलाव और बीएससी छात्रों के लिए परीक्षा लिखने का अवसर देखा है। इस बार होने वाले गेट के लिए एमबीबीएस/बीडीएस/बीएससी के छात्रों को लिखने का मौका दिया गया है।
* एक लंबा इतिहास रखने वाला यह GATE, मानव संसाधन विकास मंत्रालय, उच्च शिक्षा मंत्रालय की ओर से IISC बैंगलोर और 7 IIT के संयुक्त तत्वावधान में प्रतिवर्ष आयोजित किया जाता है। इस वर्ष यह आईआईटी रावुरकेला के तत्वावधान में आयोजित किया जाएगा।
* प्रौद्योगिकी/वास्तुकला/फार्मेसी विभागों में उच्च शिक्षा के लिए प्रवेश गेट स्कोर के आधार पर आईआईटी, आईआईएससी बैंगलोर, विभिन्न एनआईटी, प्रमुख इंजीनियरिंग कॉलेजों में उपलब्ध है। इस स्कोर के साथ कोई भी व्यक्ति केंद्रीय सरकार का मालिक बन सकता है। GATE स्कोर को महारत्न, नवरत्न और मिनीरत्न स्थिति वाले सार्वजनिक क्षेत्र के संगठनों में नौकरी प्लेसमेंट के लिए एक मानक के रूप में लिया जाता है जो उच्च वेतन के साथ नौकरी की सुरक्षा प्रदान करते हैं और कुछ निजी संगठनों में भी।
* GATE-2025 30 पेपरों में आयोजित किया जाएगा। उम्मीदवार एक या दो पेपर में उपस्थित हो सकते हैं। यदि आप दो पेपरों में परीक्षा देना चाहते हैं तो दूसरे पेपर का चुनाव पहले पेपर पर निर्भर करता है। GATE स्कोर पीजी प्रवेश के लिए तीन साल और पीएसयू के लिए एक या दो साल के लिए वैध है।
* GATE के साथ आपको हमारे देश के सभी उच्च शिक्षा संस्थानों में पीजी पाठ्यक्रमों में प्रवेश के साथ-साथ 12,400 रुपये प्रति माह का वजीफा भी मिलेगा। इसका स्कोर पीएचडी दाखिले के लिए भी उपयोगी है। 28,000 रुपये प्रति माह का स्टाइपेंड भी मिलता है.
आवेदन
आईआईएसएसी और आईआईटी में, आवेदन ऑनलाइन भरा जाना चाहिए और किसी भी गेट जोनल वेबसाइट में गेट ऑनलाइन एप्लिकेशन प्रोसेसिंग सिस्टम (जीओएपीएस) का उपयोग करके पंजीकृत किया जाना चाहिए।
वेबसाइट: https://gate2025.iitr.ac.in
ध्यान दें: जो उम्मीदवार दोनों पेपर में उपस्थित होना चाहते हैं, उन्हें दोनों पेपर के लिए अलग-अलग परीक्षा शुल्क का भुगतान करना होगा।
परीक्षण प्रक्रिया
* GATE-2025 परीक्षा तिथियां: 1, 2, 15, 16 फरवरी।
* GATE प्रश्न पत्र में कुल 100 अंकों के लिए 65 प्रश्न होंगे।
ऑनलाइन टेस्ट की अवधि तीन घंटे है। प्रश्न पत्र में दो खंड हैं।
अनुभाग-1 (सामान्य योग्यता):
* इसमें दस प्रश्न हैं। पाँच एक अंक वाले प्रश्न हैं और पाँच दो अंक वाले प्रश्न हैं। इस खंड में चार से पांच प्रश्न अंग्रेजी (मौखिक क्षमता) से संबंधित हैं और शेष प्रश्न मात्रात्मक से संबंधित हैं।
* दैनिक समाचार पत्र पढ़ना, कैट जैसी अन्य प्रतियोगी परीक्षाओं के पिछले पेपरों का अभ्यास करना
इस सेक्शन में अच्छे अंक प्राप्त करने के लिए यह उपयोगी है।
धारा-2: (संबंधित इंजीनियरिंग विषय)
* इस खंड में 55 प्रश्न हैं। इसमें 25 एक अंक वाले प्रश्न और 30 दो अंक वाले प्रश्न हैं।
गणित: 10 से 15 अंक। लेकिन इस खंड के प्रश्न शुद्ध गणित के नहीं हैं।
इंजीनियरिंग अनुप्रयोगों के साथ. प्रश्न संबंधित क्षेत्रों में नवाचारों को ध्यान में रखते हुए डिज़ाइन किए गए हैं।
प्रश्न तीन प्रकार के होते हैं
GATE प्रश्न पत्र वस्तुनिष्ठ मोड का है। इसमें तीन तरह के प्रश्न पूछे जाते हैं.
1. बहुविकल्पीय: प्रत्येक प्रश्न के उत्तर के लिए चार विकल्प होंगे। उनमें से केवल एक ही सही है. बस इसका पता लगाओ.
2. बहुविकल्पीय: ये बहुविकल्पीय प्रश्नों के समान हैं। लेकिन इसमें एक से अधिक सही विकल्प हैं। सभी सही विकल्पों को उत्तर के रूप में चिह्नित करें।
3. संख्यात्मक: इन प्रश्नों में कोई विकल्प नहीं दिया गया है। उत्तर वर्चुअल कीबोर्ड का उपयोग करके लिखे जाने चाहिए। उत्तर लिखते समय सावधानी बरतें। क्योंकि उत्तर में आसन्न इकाइयों पर भी विचार किया गया है।
 मान लीजिए सही उत्तर 68.53 है तो 68.52 से 68.54 के बीच लिखने पर अंक मिलेंगे।
नकारात्मक अंकों से सावधान रहें
* GATE में एक गलत उत्तर पर 33.33 प्रतिशत क्रेडिट अंक मिलते हैं। इसका मतलब है कि एक अंक वाले प्रश्नों के लिए 1/3 और दो अंक वाले प्रश्नों के लिए 2/3। संख्यात्मक और बहुविकल्पीय प्रश्नों में ये माइनस अंक नहीं होते हैं।
* परीक्षा केंद्र के अंदर कैलकुलेटर और मोबाइल फोन ले जाने की अनुमति नहीं है। एक ऑनलाइन वर्चुअल कैलकुलेटर उपलब्ध है. इसमें सभी प्रकार के कार्यों के अभाव के कारण तदनुसार प्रश्न निर्मित होते हैं। काल्पनिक कार्यों, उच्च क्रम समीकरणों से संबंधित प्रश्न नहीं पूछे जा सकते हैं।
तैयारी योजना
1 GATE-2025 फरवरी में आयोजित किया जाएगा। वर्तमान अवधि में तैयारी पूरी करने की योजना बनानी चाहिए। इसमें रिवीजन के लिए भी अधिक समय आवंटित किया जाना चाहिए।
2 तैयारी योजना में सभी विषयों को प्राथमिकता दी जानी चाहिए। यदि नहीं, तो परीक्षा पाठ्यक्रम को अच्छी तरह से पढ़ लेना चाहिए और तय करना चाहिए कि किन विषयों को अधिक प्राथमिकता दी जानी चाहिए।
3 टेस्ट प्रक्रिया को समझना भी जरूरी है. इससे परीक्षा के अनुभागों और प्रश्नों के अभ्यास पर स्पष्टता मिलेगी।
4 यदि तैयारी बहुत पहले शुरू कर दी जाए तो संबंधित सामग्री खरीदी जा सकती है। पाठ्यक्रम की अवधारणाओं और सामग्री का अधिक अभ्यास करें कर सकता है
5 पिछले GATE प्रश्न पत्रों का अभ्यास अवश्य करना चाहिए। इससे यह स्पष्ट हो जाएगा कि किन विषयों और अवधारणाओं को प्राथमिकता दी गई है।
6 ईएसई, इसरो, पीएसयू भर्ती प्रश्न पत्रों का अभ्यास करना चाहिए। इससे पता चलता है कि किसी विषय को कितने तरीकों से पूछा जा सकता है।
7 अच्छी गुणवत्ता वाली पाठ्यपुस्तकें और अध्ययन सामग्री चुनना महत्वपूर्ण है। एक ही विषय पर अलग-अलग किताबें न पढ़ना ही बेहतर है।
8 कठिन, सरल और यहां तक ​​कि अत्यंत सरल विषयों को भी तैयारी में प्राथमिकता देनी चाहिए।
9 प्रत्येक अध्याय और विषय को पढ़ने के बाद, प्रमुख शैक्षणिक संस्थानों द्वारा उपलब्ध कराए गए ऑनलाइन टेस्ट लिखें। तैयारी पूरी करने के बाद मॉडल प्रश्न पत्र (मॉक टेस्ट) लिखें। इससे अभ्यर्थियों को यह समझने में मदद मिलेगी कि उनकी तैयारी कैसी है।
10 चैप्टरवाइज, सब्जेक्टवाइज, मॉक टेस्ट, सैंपल पेपर्स लिखते समय हर गलत उत्तर को सही करना चाहिए। इनका अभ्यास विशेष ध्यान देकर करना चाहिए।
11 एनपीटीएल पाठों से छात्रों को बुनियादी बातों की समझ मिलेगी। विश्लेषणात्मक प्रश्नों के उत्तर लिखने के लिए भी उपयोगी है।
12 कुछ छात्र शुरू में पाठ्यक्रम से डरते हैं। लेकिन चार साल के इंजीनियरिंग पाठ्यक्रम की तुलना में GATE का पाठ्यक्रम केवल 60 प्रतिशत है।
13 GATE सिलेबस पूरी इंजीनियरिंग शाखा की केवल बुनियादी बातों और नए रुझानों को शामिल करता है। यहां तक ​​कि एक बड़ी पहाड़ी से भी यदि प्रतिदिन एक चट्टान हटा दी जाए तो वह कुछ समय के लिए गायब हो जाएगी। यदि आप आगे बढ़ें और प्रतिदिन दो से तीन घंटे प्रत्येक अवधारणा को समझें, तो आप उपलब्ध समय के भीतर पाठ्यक्रम को पूरी तरह से समझ सकते हैं।
14 अध्ययन किए गए प्रत्येक विषय की समीक्षा की जानी चाहिए। तैयारी के दौरान प्रत्येक विषय और प्रत्येक अध्याय के लिए संक्षेप में तैयार किए गए विषयों और छोटी तालिकाओं का इस अवसर पर उपयोग किया जाना चाहिए।

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh