ONGC Scholarship: యూజీ, పీజీ విద్యార్థులకు.. ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పులు | దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబరు 18 | ONGC Scholarship: For UG, PG Students.. ONGC Scholarships | Last date to apply is September 18 ओएनजीसी छात्रवृत्ति: यूजी, पीजी छात्रों के लिए... ओएनजीसी छात्रवृत्ति | आवेदन करने की अंतिम तिथि 18 सितंबर है

ONGC Scholarship: యూజీ, పీజీ విద్యార్థులకు.. ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పులు

  • దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబరు 18

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి ఏటా ఉపకార వేతనాలు అందిస్తోంది. ఇటీవలే వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన వెలువడింది!

ఎన్‌జీసీ ఏటా మొత్తం 2000 స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్‌ అభ్యర్థులకు 500 కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయినంత వరకు ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.

ఎవరికి: దేశంలో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ కేటగిరీ (ఈడబ్ల్యుఎస్‌)ల్లో ప్రతిభావంతులైన పేదలకు 
ర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్‌ కోర్సు రెగ్యులర్‌ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్‌(బీఈ/బీటెక్‌), ఎంబీబీఎస్‌ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్‌/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2024-25 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్‌ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు ఉండొచ్చు.

వయసు: ఆగస్టు 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించరాదు.

ఎంపిక: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సులకు డిగ్రీ మార్కులతో స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు.

స్కాలర్‌షిప్పు వ్యవధి: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.

కోర్సులవారీగా ఎన్ని?

ఇంజినీరింగ్‌: 500 (ఎస్సీ, ఎస్టీ), 300 ఓబీసీ, 300 జనరల్‌

ఎంబీబీఎస్‌: 90 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్‌

ఎంబీఏ: 140 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్‌

జియాలజీ/ జియోఫిజిక్స్‌: 270 (ఎస్సీ, ఎస్టీ), 100 ఓబీసీ, 100 జనరల్‌. 

దేశాన్ని 5 జోన్లగా విభజించారు. ఒక్కో జోన్‌ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్‌ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్‌ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్‌ 5 పరిధిలో ఉన్నాయి.

నిబంధనలు: 
వేరే ఏ స్కాలర్‌షిప్పులూ మంజూరు కానివాళ్లే ఓఎన్‌జీసీ ప్రోత్సాహకాలకు అర్హులు. ఎంపికైనవారి వివరాలను ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. పైన తెలిపిన కోర్సుల్లో రెగ్యులర్‌ విధానంలో భారత్‌లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్కాలర్‌షిప్పు కొనసాగాలంటే ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.

దరఖాస్తు: ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేయాలి. వయసు, కుల ధ్రువీకరణ, పదో తరగతి మార్కులు, ఇంటర్‌ లేదా గ్రాడ్యుయేషన్‌ మార్కులు, ఆదాయ ధ్రువీకరణ, బ్యాంకు అకౌంట్, పాన్‌ కార్డు, కాలేజీ ఐడీ, ప్రవేశ వివరాలు.. ఈ పత్రాలన్నీ అందించాలి.

చివరి తేదీ: సెప్టెంబరు 18

వెబ్‌సైట్‌: https://ongcscholar.org/#/


 

ONGC Scholarship: ONGC Scholarships for UG, PG Students.

 Last date to apply is September 18

Oil and Natural Gas Corporation Limited (ONGC) is one of the largest public sector companies in the country. International recognition in oil and natural gas sector. This organization provides scholarships every year to encourage talented poor students belonging to SC, ST, OBC and General categories towards higher education. Recently there was an advertisement to apply for them!

ONGC offers a total of 2000 scholarships annually. Out of this, 1000 has been allocated for SC and ST, 500 for OBC and 500 for general candidates. 50 per cent of the scholarships in all disciplines go to women. Those studying UG and PG courses in respective departments are eligible. The selected candidates will get a scholarship of Rs.48,000 per annum at the rate of Rs.4000 per month. This financial incentive will continue till the completion of the course.

Who: To the talented poor in SC, ST, OBC, General Category (EWS) studying in the country
Eligibility: Should be studying full time course in regular mode in any educational institution. Only first year students admitted in the academic year 2024-25 in any course in Engineering (BE/BTech) at Bachelor Degree level, MBBS or Geology/Geophysics/MBA at PG level should apply. It is mandatory for the students studying Engineering and MBBS courses to score at least 60 percent marks in Inter. Also, students studying M.C.-Geology/Geophysics or MBA courses should have 60 percent of the degree. Annual income of parents is Rs. Should not exceed 2 lakhs. In case of SC and ST, it can be up to Rs. 4.5 lakhs.

Age: Not exceeding 30 years as on 1st August 2024.

Selection: Based on intermediate marks for Engineering and MBBS courses; Scholarships are awarded for MBA, Geology and Geophysics courses with degree marks.

Duration of Scholarship: Four years for those enrolled in Engineering and MBBS courses; Those enrolled in MBA, Geology and Geophysics courses will be paid at the rate of Rs.4000 per month for two years.

How many courses?

Engineering: 500 (SC, ST), 300 OBC, 300 General

MBBS: 90 (SC, ST), 50 OBC, 50 General

MBA: 140 (SC, ST), 50 OBC, 50 General

Geology/ Geophysics: 270 (Sc, ST), 100 OBC, 100 General.

The country is divided into 5 zones. 200 for SC, ST, 100 for OBC and 100 for general candidates from each zone. Candidates will decide the zone according to the state where the college is located. AP and Telangana are under zone 5.

Terms:
Those who have not been awarded any other scholarships are eligible for ONGC incentives. The details of the selected candidates will be uploaded on the ONGC website. Only students who have studied in India under regular system should apply for the above mentioned courses. Annual examinations must be passed every year to continue the scholarship.

Application: Details should be registered on ONGC website. Age, Caste Verification, 10th Class Marks, Inter or Graduation Marks, Income Verification, Bank Account, PAN Card, College ID, Admission Details... All these documents should be provided.
Last date: September 18
Website: https://ongcscholar.org/#/

 

ओएनजीसी छात्रवृत्ति: यूजी, पीजी छात्रों के लिए ओएनजीसी छात्रवृत्ति

 आवेदन करने की अंतिम तिथि 18 सितंबर है

तेल एवं प्राकृतिक गैस निगम लिमिटेड (ओएनजीसी) देश की सबसे बड़ी सार्वजनिक क्षेत्र की कंपनियों में से एक है। तेल एवं प्राकृतिक गैस क्षेत्र में अंतर्राष्ट्रीय पहचान। यह संगठन एससी, एसटी, ओबीसी और सामान्य वर्ग के प्रतिभाशाली गरीब छात्रों को उच्च शिक्षा के लिए प्रोत्साहित करने के लिए हर साल छात्रवृत्ति प्रदान करता है। हाल ही में इनके लिए आवेदन करने हेतु एक विज्ञापन आया था!

ओएनजीसी सालाना कुल 2000 छात्रवृत्तियां प्रदान करती है। इसमें से 1000 एससी और एसटी के लिए, 500 ओबीसी के लिए और 500 सामान्य उम्मीदवारों के लिए आवंटित किए गए हैं। सभी विषयों में 50 प्रतिशत छात्रवृत्तियाँ महिलाओं को मिलती हैं। संबंधित विभागों में यूजी और पीजी पाठ्यक्रमों का अध्ययन करने वाले पात्र हैं। चयनित उम्मीदवारों को 4000 रुपये प्रति माह की दर से 48,000 रुपये प्रति वर्ष की छात्रवृत्ति मिलेगी। यह वित्तीय प्रोत्साहन पाठ्यक्रम पूरा होने तक जारी रहेगा।

कौन: देश में पढ़ने वाले एससी, एसटी, ओबीसी, सामान्य वर्ग (ईडब्ल्यूएस) के प्रतिभाशाली गरीबों के लिए
पात्रता: किसी भी शैक्षणिक संस्थान में नियमित रूप से पूर्णकालिक पाठ्यक्रम का अध्ययन कर रहा होना चाहिए। बैचलर डिग्री स्तर पर इंजीनियरिंग (बीई/बीटेक), पीजी स्तर पर एमबीबीएस या भूविज्ञान/भूभौतिकी/एमबीए के किसी भी पाठ्यक्रम में शैक्षणिक वर्ष 2024-25 में प्रवेश पाने वाले केवल प्रथम वर्ष के छात्रों को ही आवेदन करना चाहिए। इंजीनियरिंग और एमबीबीएस कोर्स की पढ़ाई करने वाले छात्रों को इंटर में कम से कम 60 फीसदी अंक लाना अनिवार्य है. साथ ही एम.सी.-जियोलॉजी/जियोफिजिक्स या एमबीए कोर्स की पढ़ाई करने वाले छात्रों के पास 60 प्रतिशत डिग्री होनी चाहिए। माता-पिता की वार्षिक आय रु. 2 लाख से अधिक नहीं होनी चाहिए. एससी और एसटी के मामले में यह 4.5 लाख रुपये तक हो सकता है.

आयु: 1 अगस्त 2024 को 30 वर्ष से अधिक नहीं।

चयन: इंजीनियरिंग और एमबीबीएस पाठ्यक्रमों के लिए मध्यवर्ती अंकों के आधार पर; डिग्री अंकों के साथ एमबीए, भूविज्ञान और भूभौतिकी पाठ्यक्रमों के लिए छात्रवृत्ति प्रदान की जाती है।

छात्रवृत्ति की अवधि: इंजीनियरिंग और एमबीबीएस पाठ्यक्रमों में नामांकित लोगों के लिए चार वर्ष; एमबीए, भूविज्ञान और भूभौतिकी पाठ्यक्रमों में नामांकित लोगों को दो साल के लिए 4000 रुपये प्रति माह की दर से भुगतान किया जाएगा।

कितने कोर्स?

इंजीनियरिंग: 500 (एससी, एसटी), 300 ओबीसी, 300 सामान्य

एमबीबीएस: 90 (एससी, एसटी), 50 ओबीसी, 50 सामान्य

एमबीए: 140 (एससी, एसटी), 50 ओबीसी, 50 सामान्य

भूविज्ञान/भूभौतिकी: 270 (एससी, एसटी), 100 ओबीसी, 100 सामान्य।

देश को 5 जोन में बांटा गया है. प्रत्येक क्षेत्र से एससी और एसटी के लिए 200, ओबीसी के लिए 100 और सामान्य उम्मीदवारों के लिए 100। उम्मीदवार उस राज्य के अनुसार जोन तय करेंगे जहां कॉलेज स्थित है। एपी और तेलंगाना जोन 5 के अंतर्गत हैं।

शर्तें:
जिन लोगों को कोई अन्य छात्रवृत्ति नहीं दी गई है वे ओएनजीसी प्रोत्साहन के लिए पात्र हैं। चयनित उम्मीदवारों का विवरण ओएनजीसी की वेबसाइट पर अपलोड किया जाएगा। केवल वे छात्र जिन्होंने नियमित प्रणाली के तहत भारत में अध्ययन किया है, उन्हें उपरोक्त पाठ्यक्रमों के लिए आवेदन करना चाहिए। छात्रवृत्ति जारी रखने के लिए हर साल वार्षिक परीक्षा उत्तीर्ण करनी होगी।

आवेदन: विवरण ओएनजीसी वेबसाइट पर पंजीकृत होना चाहिए। आयु, जाति सत्यापन, 10वीं कक्षा के अंक, इंटर या स्नातक अंक, आय सत्यापन, बैंक खाता, पैन कार्ड, कॉलेज आईडी, प्रवेश विवरण... ये सभी दस्तावेज प्रदान किए जाने चाहिए।
अंतिम तिथि: 18 सितंबर
वेबसाइट: https://ongcscholar.org/#/

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)