Andhra Pradesh MBBS / BDS Registration 2024-25 | NEET UG 2024 కటాఫ్ | అర్హత | వయసు | అప్లికేషన్, ప్రాసెసింగ్ ఫీజు | ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ | ఎస్వీయూ పరిధిలోని ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు | ఏయూ పరిధిలోని ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు
ఆంధ్ర ప్రదేశ్ లో MBBS BDS అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ అప్లికేషన్ లో కనబరచాల్సిన వివరాల గురించి తెలుసుకోండి | Those who wish to apply for MBBS BDS in Andhra Pradesh know the details to appear in the online application. https://geminiinternethindupur.blogspot.com/2024/08/mbbs-bds-those-who-wish-to-apply-for.html
విజయవాడలోని డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డా. ఎన్టీఆర్జియూ హెచ్ఎస్)- మెడికల్, డెంటల్ డిగ్రీ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, అనుబంధ, మైనారిటీ మెడికల్ & డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ (కన్వీనర్) కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ కోటా కింద మొత్తం 3,856 ఎంబీబీఎస్ సీట్లు, 1,540 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. స్విమ్స్ నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్( తిరుపతి) లోని ఎంబీబీఎస్ సీట్లను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే అలాట్ చేస్తారు. నీట్ యూజీ 2024 స్కోర్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. అన్ని కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుచేస్తారు. విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో సీట్లను ఆంధ్ర, రాయల సీమ అభ్యర్థులకే కేటాయిస్తారు. ఎంబీబీఎస్ డిగ్రీ వ్యవధి నాలుగున్నరేళ్లు. ఎంసీఐ/ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం మరో ఏడాది కంపల్సరీ మెడికల్ రొటేటరీ ఇంటర్న్షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. బీడీఎస్ డిగ్రీ వ్యవధి నాలుగేళ్లు. మరో ఏడాది పెయిడ్ రొటేటింగ్ ఇంటర్న్ షిప్ ఉంటుంది.
కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల వివరాలు
ఏయూ పరిధిలోని ప్రభుత్వ కళాశాలలు
· సిద్దార్థ మెడికల్ కాలేజ్, విజయవాడ - 149
· ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం - 213
· రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ - 213
· గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు - 213
· గవర్నమెంట్ మెడికల్ కాలేజ్(రిమ్స్), శ్రీకాకుళం - 128
· గవర్నమెంట్ మెడికల్ కాలేజ్(రిమ్స్), ఒంగోలు - 102
· గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, విజయనగరం - 64
· గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఏలూరు - 64
· గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మచిలీపట్నం - 64
· గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రాజమహేంద్రవరం - 64
· గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, విజయవాడ – 34
ఏయూ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు
· అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏలూరు. 125
· కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, గుంటూరు- 75
· డా. పిన్నమనేని సిద్దార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, గన్నవరం- 75
· జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, రాజమండ్రి - 125
· ఎన్ఆర్ఐ అకాడమీ అఫ్ మెడికల్ సైన్సెస్, గుంటూరు - 100
· కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండే. షన్ అమలాపురం - 75
· గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్, రాగోలు- 75
· మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నెల్లిమర్ల 100
· ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విశాఖపట్నం- 75
· గాయత్రీ విద్యా పరివత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడి
· కల్ టెక్నాలజీ, విశాఖపట్నం 100
· నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జూపూడి-75
· ఆ దాసుధా అండ్ నాగేశ్వరరావు సిద్దార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్, గన్నవరం-50
· గీతం డెంటల్ కాలేజ్, రుషికొండ - 50
· సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్, ఏలూరు 50
· విష్ణు వెంటల్ కాలేజ్, బీనువరం - 50
· శ్రీ సాయి డెంటల్ కాలేజ్, శ్రీకాకుళం 50
· జీఎస్ఎల్ వెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, రాజమహేంద్రవరం 50
· అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, విశాఖపట్నం -50
· సిఐర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, గుంటూరు-50
· కిమ్స్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అమలాపురం 50
· ఆ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, గుంటూరు 25
· లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, రాజమహేంద్రవరం . 50
· నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఇబ్రహీంపట్నం-50
ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ కళాశాలలు
· ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి - 204
· కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు - 213
· గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అనంతపురం 128
· గవర్నమెంట్ మెడికల్ కాలేజ్(రిమ్స్), కడప- 149
· ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నెల్లూరు - 149
· గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నంద్యాల - 64
· గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కడప – 85
ఎస్వీయూ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు
· నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు - 125
· పీఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, - 75
· శాంతిరామ్ మెడికల్ కాలేజ్, కర్నూలు - 75 -
· అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్,
· చిత్తూరు - 75
· విశ్వభారతి మెడికల్ కాలేజ్, కర్నూలు - 75 -
· శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్, తిరుపతి - 75
· ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కడప - 50 -
· శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమన్, తిరుపతి - 126 -
· సీకేఎస్ తహేజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, తిరుపతి - 50
· జీ. పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కర్నూలు - 25
· నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నెల్లూరు – 50
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ(బోటనీ, జువాలజీ)/ బయోటెక్నాలజీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జె క్టులుగా ఇంటర్/పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు; ఓసీ దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి.
నీట్ యూజీ 2024 కటాఫ్: మొత్తం 720 మార్కులకుగాను ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 720 నుంచి 162 మధ్య; బీసీ, ఎస్సీ, ఎస్టీ, బెంచ్మార్క్ వైకల్యం ఉన్న ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 161 నుంచి 127 మధ్య; ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల దివ్యాంగులకు 161-144 మధ్య స్కోర్ను కటాఫ్ నిర్దేశించారు.
వయసు: 2024 డిసెంబరు 31 నాటికి అభ్యర్థుల వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి. అంతకన్నా తక్కువ వయసు ఉన్నవారిని కౌన్సెలింగ్కు అనుమతించరు.
ముఖ్య సమాచారం
అప్లికేషన్, ప్రాసెసింగ్ ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.2950; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2360
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 16
website: https://drntr.uhsap.in
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు