27, డిసెంబర్ 2020, ఆదివారం

TTD News


🕉 *శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:  తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ‌నివారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుద‌ర్శ‌న చ‌క్ర‌త్తాళ్వార్‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ భూవ‌రాహ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు.

★ శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.
👹 కోవిడ్‌-19 కార‌ణంగా దాదాపు 9 నెల‌ల త‌రువాత పుష్క‌రిణిలో చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.

👉 ఈ సంద‌ర్భంగా టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, ర‌థ‌స‌ప్త‌మి, అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం, వైకుంఠ ద్వాద‌శి సంద‌ర్భంగా సంవ‌త్స‌రంలో నాలుగుసార్లు చ‌క్ర‌స్నానం జ‌రుగుతుంద‌ని తెలిపారు. కోవిడ్ త‌రువాత ప్ర‌స్తుతం ఏకాంతంగా చ‌క్ర‌స్నానం నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు.

👉🟢 °శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నాన‌మాచ‌రించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం. ద్వాద‌శి ప‌ర్వ‌దినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవ‌లను టిటిడి రద్దు చేసింది.
 *Dept.Of PRO TTD.*

కామెంట్‌లు లేవు: