తిరుమల సమాచారం 25-12-2020
నాదనీరాజనం వేదికపై భగవద్గీత అఖండ పారాయణం
వైకుంఠ ఏకాదశితోపాటు విశేషమైన గీతాజయంతిని పురస్కరించుకుని శుక్రవారం నాడు తిరుమలలోని నాదనీరాజనం వేదికపై భగవద్గీత అఖండ పారాయణం జరిగింది.
ఉదయం 6 గంటల నుండి దాదాపు 4 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో గల 700 శ్లోకాలను వేదపండితులు పారాయణం చేశారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. శ్రీ కృష్ణార్జున వ్యాఖ్యానం చేశారు. కృష్ణం వందే జగద్గురుమ్ భజనతో ఈ కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం విసి ఆచార్య మురళీధర శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్, రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
_______________________________________________________________________________
వైకుంఠ ఏకాదశికి స్థానిక ఆలయాలు కిటకిట
తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలోని వివిధ దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన కార్యక్రమం భక్తిపారవశ్యంతో జరిగింది.
తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం కళ్యాణవేంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయగుంట అభయ వేంకటేశ్వరస్వామి ఆలయం తదితర ఆలయాలలో తెల్లవారుజామునే ఉత్తర ద్వారాన్ని తెరిచారు.
భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని ఉత్తరద్వారం గుండా ప్రవేశించి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలను సుందరంగా అలంకరించింది.
#TTD
#Vaikuntaekadasi
#TTDlocaltemples
#Localtemples
____________________________________________________________________________________
టిటిడికి రూ.2.54 కోట్లు విరాళం
వైకుంఠ ఏకాదశి నాడు శుక్రవారం టిటిడికి రూ.2.54 కోట్లు విరాళంగా అందాయి. టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ కుమారగురు తన సొంత ప్రాంతమైన తమిళనాడు రాష్ట్రం ఊలందూరుపేటలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.
అదేవిధంగా, హైదరాబాద్‌కు చెందిన శ్రీ ఇంద్రకుమార్ అనే భక్తుడు టిటిడి విద్యాదాన ట్రస్టుకు రూ.1.08 కోట్లు, ప్రాణదాన ట్రస్టుకు రూ.54 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు విరాళాల డిడిలను శ్రీవారి ఆలయంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డికి అందజేశారు.
_________________________________________________________________________________
ఓం నమో వెంకటేశా:
25-12-2020
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య - 42,825
తలనీలాలు సమర్పించుకున్న వారు : 8,340
హుండీ ఆదాయం -రూ. 4.39 కోట్లు
_________________________________________________________________________________
తిరుచానూరు అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే శుక్రవారం సాయంత్రం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు.
టీటీడీ ఛైర్మన్, జేఈవో బసంత్ కుమార్ లు ఆయనకు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. బాబ్డే కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు.
#SharadArvindBobde
#Bobde
#CJI
#ChiefJustice
కామెంట్‌లు