10th 8th Qualification Mazagon Dock Vacancies || మజాగన్ డాక్ షిప్ బిల్డర్స్ లో ఖాళీల భర్తీ
భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మజాగన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైనది.
అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ కానున్న ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు ప్రారంభం తేది | డిసెంబర్ 23,2020 |
దరఖాస్తులకు చివరి తేది | జనవరి 11,2021 |
అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ తేది | ఫిబ్రవరి, 2021 |
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది | ఫిబ్రవరి, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రూప్ – A అప్ప్రెంటీస్ (10వ తరగతి ఉత్తీర్ణత ) :
ఎలక్ట్రీషియన్స్ | 31 |
ఫిట్టర్స్ | 57 |
పైప్ ఫిట్టర్స్ | 74 |
స్ట్రక్చరల్ ఫిట్టర్స్ | 43 |
గ్రూప్ – B అప్ప్రెంటీస్ (ఐటీఐ ఉత్తీర్ణత ) :
ఐసీటీఎస్ఎం | 15 |
ఎలక్ట్రానిక్ మెకానిక్ | 29 |
స్ట్రక్చరల్ (ఐటీఐ ఫిట్టర్ ) | 54 |
కార్పెంటర్ | 28 |
గ్రూప్ – C అప్ప్రెంటీస్ ( 8వ తరగతి ఉత్తీర్ణత ) :
రిగ్గర్ | 40 |
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రికల్ ) | 39 |
మొత్తం ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 410 ట్రేడ్ అప్ప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గ్రూప్ – ఏ మరియు గ్రూప్ -సీ లలో విభాగాల వారీగా ఉన్న ట్రేడ్ అప్ప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మొదటి ప్రయత్నంలో జనరల్ సైన్స్, మాథ్స్ సబ్జెక్ట్స్ తో 8వ తరగతి మరియు 10వ తరగతి లలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను.
గ్రూప్ – బీ లో ఉన్న విభాగాల అప్ప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మొదటి ప్రయత్నంలో సంబంధిత ఐటీఐ ట్రేడ్స్ లలో 50%మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 19 సంవత్సరాలనుండి 21 సంవత్సరాల మధ్య ఉండవలెను.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాల వయసు సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి నెలకు 5,000 రూపాయలు నుండి 8050 రూపాయలు వరకూ స్టై ఫండ్ లభించనున్నది.
కామెంట్‌లు