జనవరి 1 నుంచి కొత్త రూల్స్
మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ కొత్త సంవత్సరంలో
చాలా అంశాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2021, జనవరి 1న మారే ఈ
నియమనిబంధనల్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం. ఏఏ అంశాల్లో ఎలాంటి
రూల్స్ రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
సరళ్ జీవన్ బీమా:
ఇన్స్యూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రూపొందించిన స్టాండర్డ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ 'సరళ్ జీవన్ బీమా' పాలసీని ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ 2021 జనవరి 1 నుంచి అందించనున్నాయి.
వాట్సాప్ : కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓల్డ్ వర్షన్ ఉపయోగిస్తున్నవారికి ఇక వాట్సాప్ సేవలు అందవు. వారి ఫోన్లలో 2021 జనవరి 1న వాట్సాప్ నిలిచిపోతుంది.
యూపీఐ పేమెంట్:
ఈ సర్వీస్ కోసం అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే లాంటి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్స్ ఛార్జీలు వసూలు చేయనున్నాయి. జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయి.
గూగుల్ పే వెబ్ యాప్:
గూగుల్ పే వెబ్ యాప్ ఇక పనిచేయదు. మొబైల్ అప్లికేషన్ ద్వారా పేమెంట్స్ చేసినట్టే వెబ్ యాప్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చన్న సంగతి తెలిసిందే. జనవరిలో వెబ్ యాప్ ను గూగుల్ నిలిపివేయనుంది.
చెక్ పేమెంట్స్:
మీరు ఏవైనా పేమెంట్స్ చేసేందుకు చెక్స్ ఇస్తున్నారా? చెక్ పేమెంట్స్ విషయంలో కొత్త రూల్స్ వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాజిటీవ్ పే సిస్టమ్‌ను అమలు చేస్తోంది. అంటే రీకన్ఫర్మేషన్ పద్ధతి ఇది. రూ.50,000 పైన పేమెంట్స్‌కి ఇది వర్తిస్తుంది. మీరు ఓ వ్యక్తికి చెక్ రూ.50,000 పైన చెక్ ఇస్తే ఆ చెక్ క్లియర్ చేసే ముందు బ్యాంకు నుంచి మీకు సమాచారం అందుతుంది. 2021 జనవరి 1 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.
కాంటాక్ట్ లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్: మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీల గురించి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం కాంటాక్ట్ లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.2,000 మాత్రమే ఉంది. 2021 జనవరి 1 నుంచి ఆర్బీఐ ఈ లిమిట్ ను రూ.5000 చేయనుంది.
కార్లు, బైకుల ధరలు:
2021 జనవరి 1 నుంచి కార్లు, బైకుల ధరలు పెరగనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ కార్ల ధరల్ని పెంచుతున్నాయి. ఇన్‌పుట్ ధరలు పెరగడంతో కార్లు, బైకుల ధరల్ని పెంచక తప్పట్లేదు.
ఫోన్ కాల్స్: మీరు ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్లకు కాల్ చేస్తుంటారా? జనవరి 1 నుంచి ఫోన్ నెంబర్ ముందు 0 తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. లేకపోతే కాల్స్ వెళ్లవు. ఈ మేరకు కొత్త సిస్టమ్ ను 2021 జనవరి 1న ట్రాయ్ మార్చబోతోంది.
ఫాస్ట్‌ట్యాగ్: మీ ఫోర్ వీలర్‌కు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? 2021 జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించింది కేంద్ర రోడ్జు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. ఈసారి గడువు పొడిగించే అవకాశం లేదు.
ఎల్పీజీ సిలిండర్ ధరలు: ఆయిల్ కంపెనీలు జనవరి 1న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అయితే జనవరి నుంచి వారంవారం సిలిండర్ల ధరల్ని మార్చే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి.
జీఎస్టీ:
రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారులు నాలుగు జీఎస్‌టీ సేల్స్ రిటర్న్స్ లేదా జీఎస్టీఆర్-3బీ ఫైల్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం 12 ఫైల్ చేయాల్సి ఉందన్న సంగతి తెలిసిందే.
మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్:
మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ విషయంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై మల్టీ క్యాప్ ఫండ్‌లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో 25 శాతం తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. 2021 జనవరిలో ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి. దీంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లాంఛ్ చేయనున్నాయి.
కామెంట్‌లు