29, డిసెంబర్ 2020, మంగళవారం

AP Prisons Jobs Recruitment 2020 || ఏపీ ప్రిజన్స్ డిపార్టుమెంటు లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏపీ ప్రిజన్స్ డిపార్టుమెంటు లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రిజన్స్ డిపార్టుమెంటు లో ఖాళీగా ఉన్న డ్రైవర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైనది.

ఎటువంటి వ్రాత పరీక్షలు లేకుండా ఫిజికల్, మరియు డ్రైవింగ్ సామర్ధ్యం ఆధారంగా భర్తీ చేయబోయే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిడిసెంబర్ 25,2020
దరఖాస్తుకు చివరి  తేదిజనవరి 11,2021

విభాగాల వారీగా ఖాళీలు :

డ్రైవర్ (లైట్ మోటార్ వెహికల్ )3
డ్రైవర్ (హెవీ మోటార్ వెహికల్ )2

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు తెలుగు /ఉర్దూ /ఇంగ్లీష్ భాషలు చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండవలెను. మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఉండవలెను. మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాలనుండి 34 సంవత్సరాల మధ్య వయసు ఉండవలెను. రిజర్వేషన్ ల వారీగా బీసీ మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 100 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

ఫిజికల్ టెస్ట్ మరియు డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Website

 

కామెంట్‌లు లేవు: