31, డిసెంబర్ 2020, గురువారం

డిసెంబర్ 29వ తారీఖున జరిగిన రైల్వే ఎన్టీపీసీ 2020 షిఫ్ట్స్ 1&2 పరీక్షల్లో వచ్చిన బిట్స్

1). భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు?

జవాబు : డాక్టర్ భీ. ఆర్. అంబేద్కర్

2). దక్షిణ అమెరికాలో అతి పెద్ద దేశం ఏది?

జవాబు : బ్రెజిల్

3). భారత దేశంలో గల హై కోర్టు ల సంఖ్య?

జవాబు : 25

4). కాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం?

జవాబు : 1946

5). IPL – 2020 విజేత ఎవరు?

జవాబు : ముంబై ఇండియన్స్

6). జాతక కథలు ఏ మతానికి చెందినవి?

జవాబు : బౌద్ధ మతం

7). బెరి బెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?

జవాబు :తయామిన్, విటమిన్ – బీ లోపం

8). భారత్ కు న్యూ ఢిల్లీ తో సంబంధం ఉంటే, చైనా దేశానికీ దేనితో సంబంధం ఉంటుంది?

జవాబు : బిజింగ్

9).2016 వ సంవత్సరం లో నోట్ల రద్దు చేసినపుడు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేసినది ఎవరు?

జవాబు : ఊర్జిత్ పటేల్

10). భారత్ లో కమ్యూనిటీ ఎలక్షన్స్ ను మొదటగా ఏ చట్టం ప్రతిపాదించినది?

జవాబు : మింటో – మార్లే సంస్కరణలు (1909)

11). జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ గలదు?

జవాబు : ఉత్తరాఖండ్

12). మహాత్మా గాంధీజీ అధ్యక్షులు గా కొనసాగిన ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ మీటింగ్ సెషన్ ఎక్కడ జరిగింది?

జవాబు : బెల్గం (1924)

13).2017 వ సంవత్సరంలో ఇస్రో సింగిల్ లాంచ్ వెహికల్ ద్వారా ఎన్ని ఉపగ్రహలను పంపి చరిత్ర లోనికి ఎక్కినది?

జవాబు : 104 సాటిలైట్స్

14). బ్రహ్మోస్ మరియు అగ్ని లలో ఏది సూపర్ సోనిక్ కృయిజ్ క్షిపణి?

జవాబు : బ్రహ్మోస్

15). మొదటి సూపర్ కంప్యూటర్ పేరు?

సమాధానం : పరమ్ 8000

16). ప్రస్తుత తెలంగాణ గవర్నర్ పేరు?

సమాధానం : తమిళ సాయి సౌందర్య రాజన్

17). HTTP పూర్తి పేరు?

హైపర్ టెక్స్ట్ ట్రాన్సఫర్ ప్రోటోకాల్

18). HTML సంక్షిప్త నామం?

జవాబు : హైపర్ టెక్స్ట్ మార్క్ అప్ లాంగ్వేజ్

19). భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎవరు?

జవాబు : ఏ. ఓ. హ్యూమ్ (1885)

20). GST ఏ రకమైన పన్ను?

జవాబు : పరోక్ష పన్ను

21). కణాన్ని కనుగొన్నవారు?

జవాబు : రాబర్ట్ హుక్

22).రక్త వర్గాల్లో  విశ్వ గ్రహిత  అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : AB + రక్త వర్గం

23). భారత్ లో ఎత్తైన పర్వతం పేరు?

జవాబు : కాంచన జంగా

24). రాజ్యాంగ దినోత్సవం ఏ రోజున మనం జరుపుకుంటాం?

జవాబు : నవంబర్ 26

25). SAIL ప్రస్తుత ఎం. డి మరియు సీ.ఈ. ఓ ఎవరు?

జవాబు : అనిల్ కుమార్ చౌదరి

26). చంద్రయాన్ లాంచ్ వెహికల్ పేరు?

జవాబు : జియో -సింక్రానైస్ సాటిలైట్ లాంచ్ వెహికిల్

27). ప్రస్తుత UNO సెక్రటరీ జనరల్ ఎవరు?

జవాబు : అంటోనీయో గూటరస్

28). రేజ్లింగ్ విభాగంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2020 అవార్డు ను గెలుపొందినది ఎవరు?

జవాబు : వినేష్ ఫోగాట్

29).స్థానిక ప్రభుత్వ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : లార్డ్ రిప్పన్

30). స్వరాజ్ ఉద్యమం ఎపుడు జరిగింది?

జవాబు : 1906

కామెంట్‌లు లేవు: