ఇండియన్ కోస్టు గార్డు ఉద్యోగాలు
దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన భారతీయ తీర గస్తీ దళం(ఇండియన్ కోస్టు గార్డు).. భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. సముద్ర మార్గంలో స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ.. దేశ తీర ప్రాంత రక్షణ కోసం కోస్ట్‌గార్డ్‌ను ఏర్పాటు చేశారు. భారత రక్షణ దళంలో పనిచేయాలని కలలు కనే సాహసవంతుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది. నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), నావిక్ యాంత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 358
పోస్టుల వివరాలు:నావిక్(జనరల్ డ్యూటీ)-260, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)-50, యాంత్రిక్(మెకా నికల్)-31, యాంత్రిక్ (ఎలక్ట్రికల్)-07, యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)-10.
విద్యార్హతలు:
నావిక్ (జనరల్ డ్యూటీ): ఈ పోస్టులకు దరఖాస్తు చేసు కోవాలనుకునే విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉం డాలి. దీనికి వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వీరి వయసు: 18-22 ఏళ్ల వయసు కలిగినవారై ఉండాలి.
యా్రంతిక్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. వీరి వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వివిధ దశల్లో నిర్వహించే అర్హత పరీక్షల ద్వారా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 5, 2021.
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 19, 2021.
దరఖాస్తు ఫీజు: రూ.250 (ఎస్సీ/ఎస్టీలకు ఫీజు మినహయింపు ఉంది)
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://joinindiancostguard.cdac.in/

కామెంట్‌లు