IDBI Bank Recruitment 2020 Update || IDBI బ్యాంకు లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ
ఈ బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. IDBI Bank Recruitment 2020 Update
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేది | డిసెంబర్ 24,2020 |
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 7,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ – డి) | 11 |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ – సీ ) | 52 |
మేనేజర్ (గ్రేడ్ – బీ ) | 62 |
అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ – ఏ ) | 9 |
మొత్తం ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా విభాగాల వారీగా మొత్తం 134 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బీ.ఈ /బీ.టెక్ /ఏదైనా డిగ్రీ /ఎంసీఏ /మాస్టర్ డిగ్రీ కోర్సులను గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి పూర్తి చేయవలెను. సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 నుండి 45 సంవత్సరాలు మధ్య ఉండవలెను.ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు/ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 700 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులు 150 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా నెలకు 23,700 రూపాయలు నుండి 59,170 రూపాయలు జీతం గా లభించనుంది.
కామెంట్‌లు